Home Entertainment Cinema

శైలజా రెడ్డి అల్లుడు హిట్టు కొట్టాడా..?

SHARE

చైతూ, అను ఇమ్మాన్యూల్ కాంబో లో శివగామి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. వినాయకచవితి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విఘ్నాలన్ని దాటుకుని విజయవంతంగా ముందుకెళ్తుందా ? అదేంటోచూద్దాం…

ఈ చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నా, రివ్యూలన్ని నెగిటివ్ గా ఉన్నా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. సినిమా స్టోరీ విషయంలో పాత మూస ధోరణిలోనే ఉన్న దర్శకుడు మారుతి ‘ఈగో’ నే కాన్సెప్ట్ గా చేసి నడిపించటంతో కామెడీ పరంగా అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. అయితే ఏది ఎలా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం మంచి స్టామినా చూపిస్తుంది ఈ మూవీ. తొలి రోజే ఏకంగా రూ.12 కోట్ల గ్రాస్.. రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టి చైతూ కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకుంది. ఈ చిత్రం రివ్యూలు.. టాక్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్లలో మంచి వసూళ్లతో దూసుకెళుతోంది.

కాగా తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 23 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు తాజాగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేశారు. చిత్ర సక్సెస్ పట్ల నటీనటులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే కలెక్షన్స్ బట్టి ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫుల్ రన్ కలెక్షన్స్ పై ఒక అంచనాకు రావచ్చు. ఇక ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు కాంపిటిషన్ లో రిలీజ్ అయిన చైతూ డార్లింగ్ సమంత మూవీ ‘U టర్న్’ కి మల్టిప్లెక్స్ ల్లో మాత్రమే మంచి రెస్పాన్స్ వుంది. దీంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళే చాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.