Home News Updates

‘సాహో’ రిలీజ్ వాయిదా అందుకేనా…?

SHARE

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సాహో’ కోసం ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఆగస్టు 15న థియేటర్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలోనే అభిమానులకు ‘సాహో’ టీం షాకిచ్చింది. సినిమా రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న టాక్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాక్ కి గురి చేస్తూంది.

సినిమా వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేష్ ‘ఎవరు’ చిత్రాలను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘సాహో’ వాయిదా ఖాయమని అంటున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ఆగస్టు 30కి మార్చినట్లు తెలిసింది. వాస్తవానికి ‘సాహో’ సినిమాకు దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో పోటీపడే ధైర్యం అయితే శర్వానంద్, అడివి శేష్ చేయరు. కానీ, వీరిద్దరి సినిమాలు ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే, ‘సాహో’ను వాయిదా వేయడం వల్లే వీరు విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది.

. ‘సాహో’ వాయిదా పడటంతోనే విడుదల తేదీని ఆగస్టు 15కి మార్చారని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సకాలంలో పూర్తిచేయలేకపోవడం వల్లే సాహో సినిమాను వాయిదా వేశారని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే, బాలీవుడ్ వర్గాల వాదన మరోలా ఉంది. ఆగస్టు 15న ‘మిషన్ మంగళ్’, ‘బాట్ల హౌస్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటికి కూడా క్రేజ్ బాగా ఉంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కాబట్టి ఎలాంటి నష్టాలు రాకుండా ‘సాహో’ సోలోగా బాక్సాఫీసును ఏలే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందుకనే ఆగస్టు 30వ తేదీని ఎంపిక చేసుకున్నారట. ‘సాహో’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఇప్పటి వరకు ఊరించి ఊరించి ఊసురుమనిపించారని నిట్టూరుస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్…