Home Entertainment Cinema

దుమ్ము రేపిన రోబో 2.0 ట్రైలర్….

SHARE

రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.0 అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో రోబోకి సిక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై తొలి నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 4డీ టెక్నాలజీతో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. శంకర్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమైంది.

మొత్తానికి ‘2.0’ ట్రైలర్ వచ్చేసింది. అనుకున్నట్లే ఈసారి సినిమాకు విజువల్ ఎఫెక్ట్సే ప్రధాన ఆకర్షణ కాబోతోందని అర్థమైంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్లో దాదాపుగా ప్రతి షాట్లోనూ వీఎఫెక్స్ మాయాజాలం కనిపించింది. చిట్టి రోబోకు.. విలన్ డాక్టర్ రిచర్డ్ కు మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్. ట్రైలర్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశారు. ‘సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే.. సెల్ ఫోన్ చూడగానే ప్రాణభయంతో చెల్లాచెదురవుతారవుతారు చూడు’ అంటూ విలన్ పాత్ర అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగ్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

‘రోబో’లో కేవలం యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే ఉండవు. ద్వితీయార్ధంలో రోబో విలన్ గా మారాక వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు అప్పట్లో కళ్లు చెదిరిపోయేలా చేసిన మాట వాస్తవం. కానీ అంతకంటే ముందు చిట్టి రోబో తో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ ఎపిసోడ్లు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించాయి. మనసుకు హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి అందులో. అలాగే రజనీ-ఐశ్వర్యల రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.

ఐతే ‘2.0’ చూస్తే ఇందులో మొత్తం హీరో-విలన్ పోరు తప్ప ఇంకేమీ ఉండదేమో అనిపిస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ పాళ్లు తక్కువే అనిపిస్తోంది. శంకర్ ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్స్ మీదే దృష్టిపెట్టినట్లుంది. ఈ విషయంలో హాలీవుడ్ ప్రమాణాల్ని అందుకునేందుకు ప్రయత్నించినట్లుంది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.