Home Women Recipes

నోరూరించే రోస్టెడ్ చికెన్

SHARE


నోరూరించే రోస్టెడ్ చికెన్.. కావలసినవి: చికెన్ : కిలో కోడి, తాజా హెర్బల్ ఆకులు (కొత్తిమీర,వాము, పుదీనా) కొన్ని, ఉప్పు: రుచికి తగినంత, మిరియాలు: రుచికి సరిపడా, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, మసాలా: టేబుల్ స్పూన్, కారం: టేబుల్ స్పూన్.

కావలసినవి: చికెన్ : కిలో కోడి, తాజా హెర్బల్ ఆకులు (కొత్తిమీర,వాము, పుదీనా) కొన్ని, ఉప్పు: రుచికి తగినంత, మిరియాలు: రుచికి సరిపడా, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, మసాలా: టేబుల్ స్పూన్, కారం: టేబుల్ స్పూన్. స్టఫింగ్ కోసం నిమ్మకాయ ఒకటి, వెల్లుల్లి కొన్ని, రోజ్ మేరీ చిన్న కొమ్మ.

నోరూరించే రోస్టెడ్ చికెన్

తయారుచేసేదెలా: ఓవెన్ ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేయాలి. చికెన్ పైన ఉన్న తోలు లోపల ఉన్న కొవ్వు తీసేయాలి. తరవాత శుభ్రంగా కడిగి పలుచని బట్టతో తడి లేకుండా అద్దాలి. తాజా ఆకులన్నీ సన్నగా తరగాలి. ఓ చిన్న గిన్నెలో ఆకుల తురుము, ఉప్పు,మిరియాల పొడి, నిమ్మరసం, నూనె, కిచెన్ కింగ్, కారం వేసి కలపాలి. కోడిపొట్ట లోపల నిమ్మ చెక్క, వెల్లుల్లి రెబ్బలు, రోజ్ మేరీ ఉంచాలి. ఇవి తినడానికి కాదు. కేవలం మంచి వాసన కోసమే.

ఇప్పుడు తాజా ఆకుల తురుముని కోడికి అన్ని వైపులా పట్టించాలి. ఛాతీ దగ్గర చర్మం వదులుగా లాగి లోపల కూడా పట్టించాలి. కాళ్ళను మందపాటి దారంతో కట్టేసి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో సుమారు గంట నుంచి గంటన్నర రోస్ట్ చేయాలి. మధ్యమధ్యలో చికెన్ నుంచి కారిన జ్యూస్ ని అది ఎండిపోకుండా చికెన్ కు పట్టిస్తుండాలి.

మొత్తం రోస్ట్ అయ్యాక దాన్ని అలాగే పదిహేను నిముషాలు ఉంచాలి. బయటకు తీసి పొట్టలోపల ఉంచినవి అన్నీ తీసేయాలి. ఇప్పుడు దాన్ని కావలసినట్టుగా ఏ భాగానికి ఆ భాగం విడదీసి వడ్డించాలి. ఈ చికెన్ రోస్ట్ చాలా బాగుంటుంది.