Home News Politics

రేవంత్ పై ఐటీ దాడుల పరమార్ధం ఇదేనా !

SHARE

అనుకున్నదే జరిగింది. తన పై ఐటీ,ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు జరుగుతాయని మొత్తుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆరోజు రానే వచ్చింది. అసలు ఈ దాడులు ఇంత సడెన్ గా జరగడానికి కారణం ఎవరు…..తనను ఊర్కే సతాయిస్తాడు కాబట్టి ఉంటే గింటే సీఎం కేసీఆర్ హస్తం ఉండోచ్చు. ఐతే కేసీఆర్ చెప్పగానే ఈడీ,ఐటీ సై అంటూ రంగంలోకి దిగవు కదా…తీగ లాగితే కాని దీని వెనక ఉన్న భారీ స్కెచ్ అర్దమవుతుంది. అదేంటో జర దేఖో…..

కాంగ్రెస్ నేతల పై గుక్క తిప్పుకోకుండా వరుస కేసులు ఒక పక్క జగ్గారెడ్డి పై కేసు మరో పక్క గండ్ర వెంకటరమణా రెడ్డి పై కేసు ఈ లోపే కూన శ్రీశైలం పై కేసు మధ్యలో జూబ్లీ హిల్స్ సోసైటీలో అక్రమాలు అంటూ రేవంత్ కు నోటీసులు ఇంకేం రేవంత్ అరెస్ట్ కు రంగం సిద్దం అనుకున్నారు కాని అక్కడే ట్విస్టు ఉంది. రేవంత్ ముందే ఊహించినట్లు తన పై పక్క స్కెచ్ తో ప్లాన్ చేశారు. ఓటు కు నోటు కేసు నుంచి బినామీ షెల్ కంపెనీల లావాదేవీలంటూ పీకల్లోతు ఇరికించేలా ప్లాన్ చేశారు. ఈ కథ వెనుక కమళ దళం హస్తం కూడా ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్.

ఐటీని,ఈడీని ఒకే టైమ్ లో ప్రయోగించడం అంటే కేంద్రంలో బీజేపీ పర్మీషన్ లేనిది అది సాద్యం కాదు. కాంగ్రెస్ తరుపున హైపర్ యాక్టివ్ గా కనిపించే నాయకుడంటే సో మరి బీజేపీకి శత్రువే కదా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు కమళదళం కూడా కలిసి రావడంతో కమలం,కారు కలిసే రేవంత్ కి ఉచ్చుపన్నారు. ఓటుకి నోటు కేసు తెరపైకి తీసుకొచ్చి అటు చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వోచ్చన్నది ఈ రహస్య మిత్రుల ఫ్యూహంగా తెలుస్తుంది. మరి రేవంత్ ని బలంగా ఇరికించాలంటే ఏ లెవల్ కేసులు కావాలి అప్పుడు గుర్తోచ్చాయి పాత సీబీఐ కేసులు….

అనగనగా రామారావు అనే అడ్వకేట్ ఒకరు సుధీని జ‌య‌ప్ర‌కాశ్, సుధీని ప‌ద్మ అనే వారి తరుపున వకాల్తా పుచ్చుకుని గతంలో సీబీఐ తో పాటు ఈడీకి, ఐటీకి పిర్యాదు చేశారు. అది ఏమంటే రేవంత్ రెడ్డి తో పాటు, ఆయ‌న సొద‌రులు అనేక బినామి-షేల్ కంపెనీలు ఏర్పాటు చేసి, దాదాపు 300కోట్ల వ‌ర‌కు లావాదేవీలు చేశార‌నేది దాని సారాంశం. దాదాపు 10 నుండి 15 కంపెనీలు ఓకే చిరునామాతో ఉన్నాయ‌ని, ఆయా కంపెనీల్లో డైరెక్ట‌ర్లు అంతా రేవంత్, ఆయ‌న బందువుల‌తో పాటు ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న‌అనుచరగణమే అని ఆ ఫిర్యాధులో పేర్కొన్నారు. ఆ చిరునామా కూడా ప్రస్తుతం రేవంత్ నివాసం ఉన్న జూబ్లీహిల్స్ అడ్ర‌స్ పేరుతోనే ఉండ‌టాన్ని గ‌మ‌నించాల‌ని హింట్ ఇచ్చారు. పోలిటికల్ లీడర్ గా ఉన్న ప‌లుకుబ‌డి తో రేవంత్ ఇదంతా చేశార‌ని ఈ ఫిర్యాదుల సారంశం.

అహా ఇంకొంచెం బలమైన కేసు అప్పుడు మరోకటి ఉండనే ఉంది కదా ఓటుకు నోటు కేసు అప్పుడు రేవంత్ 50 లక్షలతో దొరికి పోయాడు. మరి ఆ డబ్బు ఎక్కడిది…వీటితో పాటు త‌ర్వాత చెల్లిస్తాన‌న్న మిగ‌తా డ‌బ్బును ఎలా స‌ర్ధేవారు, ఎక్క‌డ నుండి తెచ్చేవారు, ఎవ‌రి ద‌గ్గ‌ర నుండి ఆ డబ్బు వ‌చ్చేది. ఇలా ఈ కేసు తాలుకా లావాదేవిల లెక్క తేల్చాలని దీనికి మీరు రంగంలోకి దిగితే బావుంటుందని తెలంగాణ పోలీసులు సీఎం సారు సూచనతోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కి కంప్లైంట్ చేశారట….ఇది రేవంత్ కేసుల వెనుక ఉన్న కథ. కొత్తగా పార్టీలోకి వచ్చి తమకే ఏకు మేకు అయ్యాడనుకున్న కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంలో గులాబీ క్యాంప్ కి సహకారం అందించినట్లు తెలుస్తుంది….