Home News Politics

రాములమ్మ ఎక్కడ ?

SHARE

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన లేడీ అమితాబ్ విజయశాంతి ఇప్పుడు ఎక్కడున్నారు. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన రాములమ్మ రాజకీయల్లో మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత కీ రోల్ అంతకు ముందు కమలం పార్టీలో వాజ్ పాయ్,అద్వానీలతో డైరెక్ట్ యాక్సెస్ అలాంటి రాములమ్మ ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడున్నారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ కొంతకాలం కాంగ్రెస్ లో హడావిడి చేసిన విజయశాంతి గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చి కొంతకాలం మౌనానికి పరిమితం అయ్యారు. అయితే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గోనాలనుకున్న రాములమ్మ ఆ మధ్య పార్టీ చీఫ్ రాహుల్ తో భేటీ అయ్యారని టాక్. ఆ తర్వాత యాక్టివ్ అవుతారనుకున్నా మళ్ళీ ఇంటికే పరిమితమయ్యారు. ఒక దశలో విజయశాంతి కి పార్టీ ప్రచార కమిటీ భాద్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే టీ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో కాంగ్రెస్ అధిష్టానం ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఇటివల రాహుల్ పర్యటనలోనూ ఎక్కడ రాములమ్మ కనిపించలేదు.

ఇప్పుడు తాజాగా ఈ నెల చివరి వారం నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నట్లు సన్నిహితుల సమాచారం. అయితే రాములమ్మ కాంగ్రెస్, టీడీపీ పొత్తు పై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఇదే అంశం పై అధిష్టానం పెద్దలతో మాట్లాడటానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రాములమ్మ పొలిటికల్ ఫ్యూచర్ పై ఆవిడ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.