Home News Stories

ఇక దీక్షా దీక్షితులు?

తిరుమ‌ల‌కొండ వివాదం ముద‌ర‌బోతోందా?

SHARE

తెగేదాకా లాగ‌డం..త‌మ‌ను విమ‌ర్శించే వారి మీద అనుకూల‌మీడియాతో, సోష‌ల్‌మీడియాతో దుమ్మెత్తిపోసి నోరుమూయించ‌డం చంద్ర‌బాబు అండ్ కోకి బాగా అల‌వాటైపోయింది. తిరుమ‌ల ప‌విత్ర‌త‌కు భంగం క‌ల‌గ‌కుండా చూడాల్సిన ప్ర‌భుత్వ‌మే వివాదాల‌కు ఆజ్యంపోసేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌ద‌వీవిర‌మ‌ణ పేరుతో టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కుడిగా ర‌మ‌ణ‌దీక్షితులు తొల‌గింపు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. రూల్స్ ప్ర‌కార‌మే తాము వెళ్తున్నామ‌ని స‌ర్కారు చెబుతున్నా ఎన్నో అనుమానాలు. అర్చ‌కుల ప‌ద‌వీవిర‌మ‌ణ కేవ‌లం టీటీడీకే ప‌రిమిత‌మ‌ని డ్యామేజ్ కంట్రోల్‌కి ప్ర‌య‌త్నించినా జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది.

ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేసే బాధ్య‌త‌ని కేవ‌లం టీడీపీ నేత‌లే తీసుకుంటే బాగోద‌ని టీటీడీ ఈవోతో వివ‌ర‌ణ‌లు ఇప్పిస్తున్నారు. ఈమ‌ధ్యే కొలువుదీరిన టీటీడీ పాల‌క‌మండ‌లితో అంతా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగానే జ‌రిగిపోతోంద‌ని చెప్పిస్తున్నారు. ఇక ముల్లుని ముల్లుతోనే తీయాల‌నే టార్గెట్‌తో అనుకూల అర్చ‌కుల‌ను కూడా ర‌మ‌ణ‌దీక్షితులుపై ఉసిగొల్పుతున్నారు. మొత్తానికి అధ్యాత్మిక‌త ఉట్టిప‌డాల్సిన చోట రాజ‌కీయ‌ వ్యూహ‌ప్ర‌తివ్యూహ‌ల‌తో
ప్ర‌శాంత వాతావ‌ర‌ణం చెడిపోతోంది.

అటు ర‌మ‌ణ‌దీక్షితులు కూడా ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. త‌న ఆరోప‌ణ‌ల నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ‌కు డిమాండ్ చేస్తున్నారు. త‌న ఆస్తిపాస్తులు, వ్య‌క్తిగ‌త జీవితంపై టీడీపీ ప్ర‌భుత్వం, ఆ పార్టీ పెద్ద‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నా ఆయ‌న డోంట్‌కేర్ అంటున్నారు. ఇప్పుడాయన ఏకంగా టీటీడీలో అక్ర‌మాల‌పై విచారణ‌కు డిమాండ్ చేస్తూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగుతార‌నే ప్ర‌చారంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉలిక్కిప‌డుతున్నారు. తిరుమ‌ల‌క్షేత్ర ప‌విత్ర‌త‌ను కాపాడాల్సింది పోయి త‌నపై ఎదురుదాడి చేస్తూ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నందుకు నిర‌స‌న‌గా ఢిల్లీలోనే ఆయ‌న దీక్ష‌కు దిగే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

సీబీఐ విచార‌ణ కోరుతూ ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి విన‌తిప‌త్రం ఇచ్చిన ర‌మ‌ణ‌దీక్షితులు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాని కూడా క‌లుసుకున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో కేంద్రం కుట్ర‌లోకే ర‌మ‌ణదీక్షితులు ఆరోప‌ణ‌ల్ని కూడా తోసేయొచ్చ‌నుకుంటోంది టీడీపీ. అయితే అదే స‌మ‌యంలో ర‌మ‌ణ‌దీక్షితులు కూడా రాజీప‌డేదే లేదంటున్నారు. ఒక‌వేళ ఆయ‌న దీక్ష‌కు దిగితే దేశ‌వ్యాప్తంగా ఇది చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతుంది. తిరుమ‌ల క్షేత్రంతో టీడీపీ రాజ‌కీయం చేస్తోంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరుతుంది.