Home Entertainment Cinema

సిన్మాని సిన్మాలా చూడండి జర సీనేందుకు జేస్తరు…!

SHARE

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న రిలీజై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 50కోట్లు సుమారు వసూలు చేసి మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ మాస్ మసాల మూవీ. సిన్మాలోని బోల్డ్ సన్నివేశాలపై కొంత నెగిటివ్ టాక్ వచ్చినా దాని ఎఫెక్ట్ అంత సినిమా పై లేకుండా చేసింది మాత్రం రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్.

ఇక ఈ సినిమా పై స్పందించిన హీరో రామ్ “హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. హీరో స్మోక్‌ చేస్తున్నాడు.. హీరో అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.. ఎంత సేపు ఇవే గాని. అక్కడ హీరో అడ్డమొచ్చినవాళ్లని చంపేస్తున్నాడు అని ఒక్కళ్లు కూడా కంప్లయిన్‌ చేయటం లేదు. ప్రాణానికి విలువే లేదు. ఇది సిన్మార భయ్.. సీన్‌ చూడండి.. సీన్‌ చేయకండి’ అంటూ రామ్ ట్వీట్‌ చేశారు.

అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ నాదే అంటున్నాడు వెటరన్ హీరో ఆకాష్. మరో వ్యక్తి మెదడును హీరోకి మార్చడమనే లైన్‌ తెలుగు, తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో.. నన్నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాం.. ఆ సినిమా తమిళంలో ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది అన్నారు ఆకాష్. ఇదే సినిమాను తెలుగులో తీస్కొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పూరీ షాకిచ్చాడన్నాడు ఆకాష్. అన్నట్లు ఈ ఆకాష్ ఎవరంటే అప్పట్లో వచ్చిన ‘ఆనందం’ సినిమా హీరో.