Home Entertainment Cinema

రాజమౌళి తారక్,రామ్ చరణ్ ‘RRR’ లాంచింగ్ అదుర్స్….!

SHARE

అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ లాంఛనంగా ప్రారంభమైంది. అనుకున్న ముహూర్తం 11వ నెల, 11వ తేదీ ఉదయం 11 గంటలకు అంగరంగ వైభవంగా దర్శకధీరుడు రాజమౌళి ‘RRR’ లాంచింగ్ పూర్తైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.

చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గడ్డంతో దాదాపు ఒకే లుక్‌లో హాజరయ్యారు. సినిమాలో కూడా ఈ లుక్‌నే మెయిన్‌టైన్ చేయనున్నారో లేదంటే మార్చుతారో వేచి చూడాలి. ‘RRR’ను చిరు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రానికి ‘రామ రావణ రాజ్యం’ లేదంటే ‘తారక్ రామ్’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా అరుదైన.. మిలియన్ డాలర్ పిక్ ఒకటి సాధ్యమైంది. సినీ ఇండస్ట్రీకి చెందిన హేమాహేమీలు చిరు, రాఘవేంద్రరావు, కీరవాణి, సురేశ్ బాబు, వి.వి.వినాయక్, రాజమౌళి, తారక్, చెర్రీ, రానా, సెంథిల్, దిల్‌రాజు, శోభు యార్లగడ్డ, డీవీవీ దానయ్య, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్ తదితరులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు పండుగలా అనిపిస్తోంది.

అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా కూడా కెమెరాకు దొరక్కుండా సైడ్ అయిపోయారు. అయితే ఈ ఈవెంట్‌లో భాగంగా ఓ అభిమానితో దిగిన పిక్‌తో మాత్రం దొరికిపోయారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన లుక్ రివీల్ అవుతుందనో.. లేదంటే మరేదైనా కారణమ కానీ ప్రభాస్ మాత్రం కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్త వహించారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ అందజేశారు. చిరంజీవి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విషయమై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గడ్డంతో సేమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రానా, కొరటాల శివ కుడా దీనికి హాజరయ్యారు.