Home Entertainment Cinema

రాజమౌళి,బాలయ్య ప్రాజెక్ట్ ఇందుకే ఆగిందా….?

SHARE

షూటింగ్ స్టార్ట్ అయి కనీసం వారం రోజులు కూడా కాలేదు రాజమౌళి RRR షూటింగ్ లో సృహ తప్పి పడిపోయాడని వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ ఇదే. ఇక రాజమౌళి బాలయ్య కాంభినేషన్ లో మూవీకి రెండు సంవత్సరాల క్రితమే బీజంపడిందట… ‘బాహుబలి’ చేస్తున్న టైములో నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. దీనికి కారణం జక్కన్న గురువుగారే అని తెలుస్తుంది.


‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్నపుడు జక్కన్న – బాలయ్య ఇద్దరు కలిసి కూర్చుని కథలు గురించి మాట్లాడుకుంటున్న టైములో శ్రీకృష్ణ దేవరాయలు కథ ఒక కొలిక్కి వచ్చిందట. అది చేయడానికి ఇద్దరు ఓకే అనుకున్నారట. ‘బాహుబలి’ తరువాత దీనిపై పూర్తిగా కూర్చుద్దాం అని జక్కన్న ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీ అయ్యిపోయాడు. ఇక రాజమౌళి తన గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర ఈ ప్రాజెక్టు గురించి రివిల్ చేశాడట.

ఆ టైములో తన గురువు అయినా దర్శకులు రాఘవేంద్రరావు రాజమౌళి దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణ దేవరాయలు కథ అనగానే అది బాలయ్యకు తప్ప మరొకరికి బాగుండదు..ఆ ప్రాజెక్ట్ నేనే చేస్తాను అని చెప్పాడట. గురువు గారు అడగడంతో చేసేది ఏమిలేక బాలక్రిష్ణ తో సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్నాడు జక్కన్న. మరి రాఘవేంద్రరావు బాలయ్య తో ఈసినిమా ఎప్పుడు తీస్తారో తెలియాలి. ఇక అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు అటకెక్కింది. మళ్ళీ దినికి మోక్షం ఎప్పుడో ఈ ఇద్దరు దర్శక ధీరులకే తెలియాలి.