Home News Stories

రాజమహేంద్రవరంలో టిక్కెట్ కోసం తోడళ్ళుల్ల ఫైట్…

SHARE

రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన అక్కడి అసెంబ్లీ టిడిపి టికెట్ కోసం తోడళ్లులు హోరా హోరీగా పోటీ పడుతున్నారు… నిన్నటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య జరిగిన టికెట్ పోరు నేడు కో బ్రదర్స్ మధ్య వార్‌గా తయారైంది … ఆర్థికంగా, సామాజికంగా ఇద్దరు బలమైన అభ్యర్ధులే కావడంతో టికెట్‌ పోరు ఆసక్తికరంగా తయారైంది … రాజమహేంద్రవరంగా పిలుచుకునే రాజమండ్రిలోని అర్బన్ అసెంభ్లీ సీటు…. టీక్కెట్ కోసం కో-బ్రదర్స్ పోటీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది….

ఎన్నికల సమయం దగ్గరపడిన వేళ రాజమండ్రి అర్బన్‌ టీడీపీ టిక్కెట్ వ్యవహారం రసవత్తరంగా మారుతోంది.. నిన్నటి వరకూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి… ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఇక్కడ పార్టీ టిక్కెట్ కోసం నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు … ఇద్దరు నేతల మధ్య విభేదాలు పలు సందర్భాల్లో రచ్చకెక్కాయి. అయితే ఇటీవల రాజమండ్రి టిక్కెట్ విషయంలో నెలకొన్న పోటీ మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు స్వయానా తోడళ్లుడైన చల్లా శంకర్రావు టిడిపి టిక్కెట్ కోసం గట్టిప్రయత్నాల్లో ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇటీవలే జరిగిన జయహో బీసీ సభ సందర్భంగా… టిక్కెట్ కోసం ఇద్దరు కో-బ్రదర్స్ మధ్య పోరు బహిర్గతమైంది..

గతంలో రాజమండ్రి అర్బన్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత గోరంట్ల… ప్రస్తుతం ఐదోసారి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు… రూరల్‌కి షిప్ట్‌ అయినా రాజమండ్రి అర్బన్‌ పై ఆయన తప పట్టు సడలకుండా చూసుకుంటూవచ్చారు .. రానున్న ఎన్నికల్లో తన పాత నియోజకవర్గానికి వచ్చేస్తానే సంకేతాలు కూడా అప్పట్లో ఇచ్చారు … మరోవైపు ఆదిరెడ్డి మూడేళ్ల క్రితం టిడిపిలోకి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి .. తనకు లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరికి రాజమండ్రి అర్బన్ టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు…

ఆ క్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల… ఎమ్మెల్సీ ఆదిరెడ్డిల మధ్య సిటీ టిక్కెట్ కోసం నువ్వానేనా అనే పోటీ వాతావరణం కనిపించింది… తాజాగా ఎమ్మెల్యే గోరంట్ల ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ లోనే ఉండిపోతాననే సంకేతాలు ఇస్తున్నారు… అదే సమయంలో గోరంట్లకు బదులు చల్లా శంకర్రావు టిక్కెట్ రేస్ లోకి వచ్చి చేరారు… టిక్కెట్ కోసం స్వయనా తన తోడళ్లుడైన ఆదిరెడ్డి అప్పరావుకి గట్టిపోటీ ఇవ్వబోతున్నారనీ …ఇటీవల జరిగిన జయహో బి.సి. సభ సందర్భంగా చల్లా శంకర్రావు చేసిన ప్రచారాన్ని బట్టి అర్థమైందని రాజమండ్రి తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.~

ప్రస్తుతం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న చల్లా శంకర్రావు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.. తర్వాత కాంగ్రెస్ లో చేరి రెండేళ్ల క్రితం టీడీపీ గూటికి చేరారు… ఆదిరెడ్డి ఆయన తోడల్లుడు చల్లా శంకర్రావులు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా… రాజమండ్రిలో వారి ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే సంఖ్యలోనే ఉన్నాయి .. ఆర్థికబలం సహా ప్రస్తుతం తాను ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ లో పెద్దసంఖ్యలో సభ్యులు ఉండటం చల్లాకు కలిసొస్తాయనే అంచానా ఉన్నాయి.

రాజమండ్రి అర్బన్‌ టిడిపి టిక్కెట్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాల వెనుక ఎమ్మెల్యే గోరంట్ల వ్యూహం ఉందంటున్నారు… సామాజిక సమీకరణాల దృష్ట్యా తనకు రూరల్ నియోజకవర్గమే సేఫ్ అని భావిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తనకు సిట్టింగ్ స్థానమే కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది… అదే సమయంలో వ్యూహాత్మకంగా తనకు అర్బన్‌ టిక్కెట్ విషయంలో పోటీ వస్తున్న .. ఆదిరెడ్డికి చెక్ పెట్టేలా స్వయనా ఆయన తోడల్లుడు చల్లా శంకర్రావును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య హోరాహోరీగా సాగిన రాజమండ్రి టీడీపీ టిక్కెట్ పోరు ప్రస్తుతం కోబ్రదర్స్ మధ్య పోటీగా మారింది… మరో వైపు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు ఆదిరెడ్డి వాసుకు టీడీపీ టికెట్ ఖరారు అయ్యిందనే ప్రచారం జరుగుతోంది… ఏదేమైనా టిడిపి అధినేత అభ్యర్ధుల లిస్ట్‌ రిలీజ్‌ చేసే వరకు ఈ సస్సెన్‌ వీడే పరిస్థితి లేకపోవడంతో తమ్ముళ్లలో గందరగోళం నెలకొంది.