Home News Stories

రాహుల్ రాకతో ఏపీలో కాంగ్రెస్ మైలేజ్ పెరిగిందా…?

చేతిదాక వచ్చింది నేల పాలు అయినట్లుంది ఏపీలో హస్తం పార్టీ పరిస్థితి. శ్రేణుల్లో ఉత్సహం నింపాల్సిన టైంలో ఎన్నికల శంఖారావం లాంటి అందివచ్చిన అవకాశాన్ని నేతల తప్పిదాలతో చేతులారా వదులుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.. చివరకు అధినేత వచ్చారు వెళ్లారు అనుకోవడం తప్ప కాంగ్రెస్ కి వచ్చిన మైలేజీ ఎంత అంటే పార్టీ నేతలే బిత్తర చూపులు చూస్తున్నారు.తిరుపతిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హల్ చల్ చేసిన అది పెద్దగా జనాలను ఆకర్షించలేదని ఊసురుమంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.

చచ్చిన పామును బతికించుకోవాలనే లక్ష్యంతో సాగిన రాహుల్ తిరుపతి టూర్ ,బహిరంగ సభ పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయంలో ఉన్నాయి రాజకీయా వర్గలు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఇదివరకే చెప్పిన విషయాన్ని మరోమారు కోత్తగా చెప్పాలనుకోవడం ఏంటని కాంగ్రెస్ నేతలే ప్రశ్నిస్తున్నారు…రాహుల్ ల్ ప్రసంగం మొత్తం రఫెల్,మోడీని దూషించడం మినహా ఆయన ఏపీకి ఏంచేస్తారన్నది స్పష్టంగా చేప్పలేకపోయారన్నది కాంగ్రెస్ నేతల అత్మపరిశీలనలో తేలింది. పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా అధికారంలోకి కచ్చితంగా వస్తాం, మీ కష్టాలన్నీ తీరుస్తాం అని చెప్పడం నాయకులకు అలవాటు. రాహుల్ గాంధీ మాత్రం ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ హామీ నెరవేరుతుందని దాన్ని అడ్డుకునే దమ్ము ఎవరికి లేదంటూ కుండబద్దలు కోట్టారు.మేము వస్తే ఇస్తామని కాకుండా ఎవరు వచ్చిన ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ శ్రేణులను డీలా పడేలా చేసిందని టాక్..

ఇక పదేళ్ళ తరువాత తిరుపతికి వచ్చిన అధినేత, ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభను సక్సస్ చేసుకోవడంలో ఏపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. యాభై వేలు అనుకున్న సభకు పదివేలమంది కూడా రాలేదు… ఎండ కారణంగా సగం సభ మధ్యలోనే వెళ్లిపోయారు. ఏపీలో రఘవీరా,పల్లంరాజు,కనుమూరి బాబిరాజు,మాజీ ఎంపీ చింతామోహన్ ,మాజీ సీఎం కిరణ్ కూమార్ రెడ్డి లాంటి నేతలు ఉన్నా సభకు పదివేల మంది కూడా హాజరుకాలేదు. తిరుమలకు కాలినడకన రెండు గంటల్లో వెళ్లారని చెప్పుకోవడం శ్రేణుల్లో ఆశ్చర్యనికి గురిచేసింది..కీలమైన సభ.. అది అధినేత పదేళ్ళ తరువాత తిరుపతి వచ్చి ఎపీ పై ఎమీ మట్లాడుతారో అని ఎదురుచూస్తుంటే రెండు గంటల్లో కోండ ఎక్కారు అని నేతలు రాహుల్ ముందకు భజనలు చేశారని విమర్శలు వస్తున్నాయి…

వెంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సారి మోడీకి గట్టి బుద్ధి చెప్పాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు ఊకదంపుడు ప్రసంగాలు అయితే చేశారుగానీ.. అవి ఏవి శ్రేణుల్లో ఉత్సహం నింపలేదనే చెప్పాలి… రాహోల్ నుంచి ఇతర నేతల వరకు అందరు మోడీ టార్గెట్ చేసుకున్నారు తప్ప… ఏపీ అధికార ,ప్రతిపక్ష పార్టీలపై ప్రస్తవన రానీయకుండా చూసుకోవడం కోసమెరుపు…పార్టీ చీఫ్ తిరుమల వచ్చారు శ్రీవారి దర్శినానం చేసుకుని తిరిగి వెళ్ళారంతే.. అంతకు మించి, ఆయన టూర్‌లో ఎలాంటి ప్రత్యేకత లేకుండాపోయిందని మదనపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.