Home Women Recipes

పెరుగు కేక్ తయారీ

SHARE

పెరుగు కేక్ తయారీ.. కావలసినవి: మైదా పిండి: కప్పున్నర, పంచదార పొడి: రెండువందల గ్రాములు, వంట సోడా: అర చెంచా, బేకింగ్ పొడి: ఒకటింపావు చెంచా, నూనె:అరకప్పు,

ఆరోగ్యానికి పెరుగు ఎంతో మంచిది. పెరుగుతో ఎన్నో వెరైటీలు తయారుచేసుకోవచ్చు. పెరుగుతో కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

పెరుగు కేక్

కావలసినవి:
మైదా పిండి: కప్పున్నర,
పంచదార పొడి: రెండువందల గ్రాములు,
వంట సోడా: అర చెంచా,
బేకింగ్ పొడి: ఒకటింపావు చెంచా,
నూనె:అరకప్పు,
ఎండుఫలాలు: కొన్ని,
వెనిలా అసెన్స్: చెంచాన్నర,
పాలు: చెంచా,
వెన్న: అరకప్పు,
క్రీమ్ కోసం పాలు: 3 చెంచాలు,
వెనిలా ఎస్సెన్స్: రెండు చెంచాలు.

కేక్ తయారీ: నూనె లేకుండా మైదా పిండిని సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార వేసి బాగాగిలక్కొడితే కరిగిపోతుంది. తరువాత అందులో వంటసోడా, బేకింగ్ పొడివేసి బాగా కలియ తిప్పి పక్కన పెట్టాలి. పదినిముషాలయ్యాక నూనె,వెనిలా అసెన్స్ చేర్చాలి. మరికాసేపటికి మైదాపేస్టు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. క్రీమ్ లా తయారైన ఈ మిశ్రమంలో ఎండుఫలాలు వేసి కేక్ మౌల్డ్ లో తీసుకుని ఓవెన్ లో బేక్ చేయాలి. అరగంటయ్యాక తీయాలి. పైన చెంచాతో పాలు చుక్కలుగా వేస్తే త్వరగా చల్లగా అవుతుంది.

క్రీమ్ తయారు: వెన్నలో పంచదార, పాలు,వెనిలా అసెన్స్ చేర్చి మిక్సీలో ఒక్కసారి తిప్పాలి. క్రీమ్ గట్టిగా అయితే కాసిని పాలు చేర్చాలి. ఇప్పుడు ఈ క్రీమ్ ను కేక్ మీద పరిచి బాదంతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు కేక్ ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఒకసారి తయారుచేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు.