Home News Politics

గుళ్ల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు

ప‌ర‌మ‌భ‌క్త ప‌వ‌న్‌క‌ల్యాణుడు

SHARE

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త అవ‌తారమెత్తాడు. సాధార‌ణంగా పెద్ద‌గా గుళ్లు గోపురాలు తిర‌గ‌ని ప‌వ‌ర్‌స్టార్ మూడ్రోజుల‌నుంచీ ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇంత హ‌ఠాత్తుగా ఇలా భ‌క్తాగ్రేస‌రుడిగా మారిపోయాడేంటా అని అంతా ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు. ఆప‌సోపాలు ప‌డుతూ కాలిన‌డ‌క‌న‌ మెట్లెక్కి తిరుమ‌ల వెంక‌న్న‌ని ద‌ర్శించుకున్నాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. మ‌ధ్య‌లో శోషొచ్చినంత ప‌న‌యినా ఆప‌ద‌మొక్కుల‌వాడి ద‌ర్శ‌నం చేసుకున్నాడు.

చూస్తుంటే రాజకీయ యాత్రలకు ముందు పవన్ కల్యాణ్ ఆధ్మాత్మిక పర్యటన చేయాల‌నుకుంటున్న‌ట్లుంది. శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత తిరుమ‌ల సమీపంలోని దేవాలయాల్లో పూజ‌లు నిర్వహించాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. సర్వదర్శన లైన్‌లోనే జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీవాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. తర్వాత ద‌గ్గ‌ర్లోని గుడిమల్లం పరుశురామశ్వరస్వామి ఆలయం, వికృతమాల శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

రాజకీయంగా కీలకమైన అడుగులు పడుతున్నస‌మ‌యంలో స్వామి ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లుంది. అందుకే అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామి సేవలో తరించారు. పవన్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు శ్రీకాళహ‌స్తీశ్వర స్వామి ఆలయం ద‌గ్గ‌రికి పోటెత్తారు. పవన్ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయాక‌గానీ ప‌రిస్థితి అదుపులోకి రాలేదు.