Home Women Recipes

బంగాళా దుంప-ములక్కాడ కూర

SHARE

మునగాకు, మునక్కాడలు ఆరోగ్యానికి ఎంతోమంచివి. మునగాకును రోజూ ఆహారంగా తీసుకుంటే నేత్ర సంబంధమయిన ఇబ్బందులు, కంటిచూపు సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు బాగుంటుంది, బంగాళాదుంపతో కలిపి ములక్కాడలను వండుకుంటే ఎంతో బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ములక్కాడలు లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతాయి.

ఆలూ-ములక్కాడ కూరకు కావలసిన పదార్ధాలు: బంగాళదుంపలు – 500 గ్రా.
ములక్కాడలు – రెండుములక్కాడలు చిన్నగా కోసుకుని ఉంచుకోవాలి.
పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూను
జీలకర్ర – టీ స్పూను
పసుపు – చిటికెడు
అల్లం తరుగు – టీ స్పూను
వెల్లుల్లి రేకలు – 6
ఉప్పు – తగినంత
ధనియాలపొడి – టీ స్పూను
నూనె – 3 టేబుల్ స్పూన్లు

తయారుచేసే విధానం: బంగాళదుంపలను, ములక్కాడలను శుభ్రంచేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చోట పెట్టుకోవాలి. ములక్కాడ ముక్కలను ఉడికించుకుని ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక, జీల కర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి. బంగాళదుంప ముక్కలను జత చేసి మెత్తబడేవరకు వేయించాలి. మసాలాపొడి, ములక్కాడలు జత చేసి బాగా కలపాలి.ధనియాలపొడి చల్లి బాగా కలిపి దించేయాలి.ములక్కాడలు బాగా మెత్తబడేవరకూ ఉడకనివ్వాలి. బంగాళాదుంప, ములక్కాడలు బాగా కలిసిపోయాక, మసాలా, ఉంటే కొత్తిమీర వేసుకుని దించి, వేడివేడిగా తింటే బాగుంటుంది. చపాతీలోకి కూడా ఈ కర్రీ బాగుంటుంది.