Home Women Health

క్యాన్సర్ తో పోరాడే బంగాళాదుంప: జీర్ణాశయ క్యాన్సర్ కు చెక్

SHARE

బంగాళాదుంపలను సన్నగా కోసి ఆ ముక్కలను అలసిన కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పచ్చి దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా ఉంటుంది. బాలింతలకు బాగా పాలుపడాలంటే బంగాళాదుంపలను ఆహారంలో చోటు కల్పిస్తే సరి.

ఇన్ని ఉపయోగాలున్న బంగాళాదుంపలను స్థూలకాయులు మాత్రం తీసుకోకూడదు. షుగర్ వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులున్నవారికి ఇది మంచిది కాదు. ఆకుపచ్చగా ఉండే బంగాళాదుంపలలో సొలనైన్ అనే పదార్థం టాక్సిన్‌గా పనిచేస్తుంది. కనుక వాటిని తీసుకోకూడదు. సహజంగా చాలామంది బంగాళాదుంపలను మాంసంతో కలిపి వాడటం వల్ల సొలనైన్ ఎక్కువై, జననావయవాలకు దురద కలిగే అవకాశం ఉంది. సుఖవ్యాధులతో బాధపడేవారు బంగాళాదుంపలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

క్యాన్సర్ తో పోరాడే బంగాళాదుంప: జీర్ణాశయ క్యాన్సర్ కు చెక్ :జీర్ణాశయ క్యాన్సర్‌కు ఆలుగడ్డలతో చెక్ పొట్టొచ్చని బీజింగ్‌లోని జెబియాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో తేలింది. పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుంది. వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జీర్ణాశయంలో ఒత్తిడిని దూరం చేస్తుందని వారు తేల్చారు.

ఆలుగడ్డ గురించి మీకేం తెలుసు? కమ్మటి కూర వండొచ్చు. కరకరలాడే చిప్స్ చేయొచ్చు. వంకాయతో కలిపి వండి యమ్మీగా లాగించేయొచ్చు. ఉడికించి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్తారని మాకు తెలుసు. అందుకే ఆలుగడ్డ గురించి ఓ సరికొత్త పాయింట్ చెప్పాలనుకుంటున్నాం. కూరగాయలతో క్యాన్సర్ ముప్పు జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. జీర్ణాశయ క్యాన్సర్‌కు ఆలుగడ్డలతో చెక్ పొట్టొచ్చని బీజింగ్‌లోని జెబియాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో తేలింది.

పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుంది. వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి జీర్ణాశయంలో ఒత్తిడిని దూరం చేస్తుందని వారు తేల్చారు. ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని ఈ పరిశోధనలో తేలింది. బంగాళా దుంపలో ఉండే బి6 విటమిన్ శరీరంలోని ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి. ఆలులో ఉన్న పీచు పదార్థం గుండెజబ్బుల నుండి రక్షణనిస్తుంది. భోజనం చేసే ముందు ఒకటి లేదా రెండు చెంచాల ఆలూ రసం తీసుకుంటే రుమాటిజం తగ్గుతుంది. పచ్చి బంగాళాదుంప రసం తీసుకుంటే జీర్ణాశయం, పేగుల ఇబ్బందులు తొలగుతాయి.