Home News Politics

పోసాని పొలిటికల్ మూవీ రెడీ….టార్గెట్ ఎవరు…?

SHARE

రాజకీయాలు, సినీ రంగానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .. నటులు తమకు నచ్చిన పార్టీలకు మద్దతు తెలపడం, ఆయా పార్టీల్లో చేరి పోటీ చేయడం కామన్‌ అయిపోయింది.. ఆ క్రమంలో సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఎలా ఉన్నా బయటకు వచ్చే సరికి మాత్రం వారి మధ్య పొలిటికల్‌ గ్యాప్‌ స్పష్టంగా కనిపిస్తోంది.. దానికి తగ్గట్లే తాము సపోర్ట్‌ చేస్తున్న పార్టీల ప్రత్యర్ధులపై వ్యంగ్య సినిమాలు కూడా తీసేస్తున్నారు .. ఇప్పుడు అలాంటి రాజకీయ వ్యంగ్య చిత్రం ఒకటి శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందంట….

తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు రాజకీయాల దశదిశ మార్చేశారు ఎన్టీఆర్‌.. ఆయన పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతున్న టైంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.. అప్పట్లో ఎన్నికల సమయంలో కృష్ణ ప్రమేయంతో ఎన్టీఆర్‌పై పలు విమర్శనాత్మక, వ్యంగ్య చిత్రాలు విడుదలయ్యాయి.. .. మండలాదీశుడు, గండిపేట రహస్యం, నా పిలుపే ప్రభంజనం, రాజకీయ చదరంగం వంటి చిత్రాలు అప్పట్లో పొలిటికల్‌గా చర్చనీయాంశం అయ్యాయి .. వాటిలో కొన్నిటిలో కృష్ణ నటించారు కూడా ..

ఇప్పుడు అదే ట్రెండ్‌ కొనసాగిస్తూ మరో సినిమా నిర్మాణమవుతోందంట.. కడప జిల్లా పులివెందుల చుట్టుపక్కల… సింగిల్‌ షెడ్యూల్‌లో శరవేగంగా ఆ మూవీ షూటింగ్‌ జరుగుతోందంట.. కాంట్రవర్సీకి మారుపేరైన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ సారథ్యంలో వ్యంగ్య చిత్రంగా అది తెరకెక్కపోతుందంటున్నారు ..కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నీ పోసాని కృష్ణమురళీనే అంట ఆ సినిమాకి.. ఆయన అందులో ఒక ప్రధాన పాత్ర కూడా పోషిస్తున్నారంట.. మీడియాలో ప్రత్యర్ధి పార్టీలపై తనదైన స్టైల్లో చెలరేగిపోయే పోసాని ఆ సినిమాలో కూడా అదే చూపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది..

పులివెందుల వద్ద ఏపి రాజకీయాల్ని బేస్‌ చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్న ఆ చిత్రంలో … పోసాని ఖచ్చితంగా టిడిపినే టార్గెట్‌ చేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. మరి ఆయన ఎవరిపై ఎన్ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారో చూడాలి మరి…