Home News Stories

ముబైల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తోన్న పొలిటికల్ పార్టీలు…

SHARE

ఆఫీస్ లో మీటింగ్ …మరో ముఖ్యమైన పనిమీద సీరియస్ గా బైక్ పై రైడింగ్ సడన్ గా జేబులో ట్రింగ్ మన్న ముబైల్ తీరా చూస్తే…నాకు ఓటేయాలంటూ అభ్యర్థుల వాయిస్ కాల్ చిర్రెత్తుకొచ్చిన వాహనదాడి ఫస్ట్రేషన్ కి ఇదో పరాకష్ట. సామాజిక మాధ్యమాలతో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ల సేకరించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల రచ్చ వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది….ముఖ్యంగా రాజధాని నగరంలో ఓటర్ల జాబితాతో కాల్‌ సెంటర్లకు వెళ్తూ మెసేజ్‌లు, వాయి్‌సకాల్స్‌ టారీ్‌ఫలు తీసుకుని ప్రచారంతో ప్రాణ సంకటంగా మారారు పొలిటికల్ క్యాండెట్లు.

ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు, టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక లక్ష్యంతో కంటిమీద కునుకు లేకుండా ప్రచారం చేస్తున్నారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే టికెట్లు పొందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులతోపాటు స్వతంత్రంగా పోటీ చేస్తున్న కొంతమంది వివిధ సామాజిక మాధ్యమాలను ఎంచుకుని ప్రచారాన్ని పీక్స్ కి తీసుకెళ్తున్నారు.

సెల్‌ఫోన్లకు పంపించే విధంగా కొంతమంది అభ్యర్థులు బల్క్‌ మెసేజ్‌ టారీఫ్ ను ఎంచుకున్నట్లు తెలిసింది. ఒకేసారి 500 నుంచి 1000 మందికి తమ పేరు, గుర్తు, నియోజకవర్గం వివరాలను పంపిస్తున్నారు. అలాగే ‘నేను ఫలానా అభ్యర్థిని.. నేను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా’నంటూ వాయిస్‌ కాల్స్‌ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫోన్ నంబర్ల సేకరణకు ఎజేన్సీలతో టచ్ లోకి వెళ్ళీ అడ్డదారులు తొక్కుతున్నారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలోని ఓటర్ల జాబితా వివరాలను పలువురు అభ్యర్థులు పలు ఏజెన్సీల నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్యాస్‌, టెలీఫోన్‌, ఇంటర్నెట్‌, పోస్టుపెయిడ్‌ నెట్‌వర్క్‌ల నుంచి ఓటర్ల సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వివరాలను తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పలువురు ఓటర్లు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని అభ్యర్థుల సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు.

ఆయా పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఓటర్లకు మెసేజ్‌లు పంపించడంతోపాటు వాయిస్‌ కాల్స్‌ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి పది నిమిషాలు, అరగంటకోసారి మెసేజ్‌లు పంపిస్తుండడంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిన వెంటనే బైక్‌ను పక్కకు నిలిపి మాట్లాడి ఫస్ట్రేషన్ కి గురవుతున్నారు.

ఇదిలా ఉండగా, అభ్యర్థులకు అసలు తమ నంబర్లను ఎవరిచ్చారు.. ఎందుకు ఇచ్చారో.. అనే దానిపై ముబైల్ వినియోగదారులు కంగారెత్తిపోతున్నారు. కొందరైతే తమకు ఎక్కువగా ఎవరు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారో వారి పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో మెసేజ్‌లతో హడలెత్తిస్తున్నారు.