Home News Politics

పవన్ నాకు తండ్రి కాని….కాంగ్రెస్ అంటే గౌరవం!

SHARE

సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితడు. బండ్ల గణేశ్ తో పాటు టీఆర్ఎస్ అసమ్మతి నేత ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. బండ్ల గణేశ్ తన పౌల్ట్రీ వ్యాపారాలు ఉన్న షాద్ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు టాక్.


అయితే పవన్ ను దేవుడిగా అభివర్ణించే బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మెగా కుటుంబానికి సన్నిహితుడైన బండ్ల గణేష్ జనసేన లో చేరకుండా కాంగ్రెస్ లో చేరడంతో మెగా అభిమానులు వీస్తుపోయారు. చిన్న పాత్రలు చేసుకుంటూ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న బండ్ల గణేశ్ 2009 లో రవితేజ మూవీ ఆంజనేయులుతో నిర్మాతగా మారాడు. ఆ తరువాత టాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మించిన తీన్ మార్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా పవన్ వరుసగా రెండోసారి గణేష్ కు చాన్స్ ఇచ్చాడు. ఈ సారి నిర్మించిన గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదన్నదానికి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు గణేశ్. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమన్న బండ్ల గణేశ్ పవన్ తనకు తండ్రిలాంటి వాడన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే కూడా చిన్నప్పటి నుంచి గౌరవం ఉందని ఇందిర,రాజీవ్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అలాంటి పార్టీలో చేరడాన్ని గర్వంగా ఫీలవుతున్నా అన్నారు.
బండ్ల గణేశ్ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఉన్నా తను వ్యాపారాలు నిర్వహిస్తున్న షాద్ నగర్ నుంచే బరిలో దిగే చాన్స్ స్ ఎక్కువగా ఉన్నాయి. గణేశ్ తో పాటు చేరిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసే అవకాశముంది. మొత్తం మీద నేతల చేరికలతో కాంగ్రెస్ లో జోష్ కన్పిస్తోంది.