Home News Politics

పలమనేరు వైసీపీలో నాలుగో కృష్ణుడు….!

పలమానేరు వైసీపీలో ఏం జరుగుతుంది.తమ పార్టీలో గెలిచి ప్రత్యర్థి పార్టీలో చేరి మంత్రి అయిన అమర్‌నాథ్‌రెడ్డి పై ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్న పలమనేరు వైసిపి శ్రేణులకు పార్టీ ఇంచార్జుల మార్పు పిచ్చెక్కిస్తుందా. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే (ప్రస్థుత టీడీపీ మంత్రి వర్యులు) అమర్‌నాథ్‌రెడ్డి నిష్క్రమణ తర్వాత సెగ్మెంట్‌కు ఇప్పటి వరకు ముగ్గురు నేతలు తామే ఇంచార్జులమంటూ తెరపైకి వచ్చారు. దాంతో అసలు కృష్ణుడు ఎవరనేది అర్థం కాకుండా కన్ ఫ్యూజన్ గా తయారైంది పార్టీ శ్రేణుల పరిస్థితి … తాజాగా మరో నేత హాడావుడి చేస్తుండటంతో అసలు ఎవ్వరు పోటీలో వుంటారనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి అమర్‌నాథ్‌రెడ్డి గెలుపొందారు .. తర్వాత సొంత గూడు టిడిపిలో చేరి పరిశ్రమల శాఖ మంత్రయ్యారు… దీంతో అయన విజయానికి సహకరించిన వైసిపి శ్రేణులు మంత్రిపై రగిలిపోతున్నాయి… అయితే కార్యకర్తలలో వున్న పట్టుదల ఇప్పుడు నాయకులలో కనిపించడం లేదు… నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్‌గా ఎప్పుడు ఎవరు ఉంటారో అర్థం కాకుండా తయారైంది పరిస్థితి .. దాంతో అసలు పోటీలో నిలిచే అభ్యర్ధి ఎవరనేది అర్థం కాకుండా తయారైంది కార్యకర్తలకి .. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అశీస్సులతో ఇన్‌ఛార్జ్‌లుగా వస్తున్నామని చెబుతున్న నాయకులు కొద్దికాలానికే మారిపోతుండటం చర్చనీయాంశంగా మారింది…

అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ మారిన తర్వాత నియోజవవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ వైసిపి బాధ్యతలను తాను పర్యవేక్షిస్తానని వెల్లడించారు .. అప్పట్లో బిల్డర్ రాకెష్‌రెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు… పార్టీ కార్యక్రమాలను రాకేష్‌ కొద్ది రోజుల పాటు నిర్వహించారు… ఇదే సమయంలో ఆకుల గజేంద్ర అనే నాయకుడు రంగప్రవేశం చేసారు.. సెగ్మెంట్లో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్నాయని… ఈ సారి తానే అభ్యర్ధినని హడావుడి చేశారు.


అదే సమయంలో రాకేష్‌రెడ్డి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో లక్ష్మి ఎన్టీఆర్‌ అనే బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు…అయితే ఆ తర్వాత బయోపిక్ ఏమైందో తెలియదు … రాకేష్ రెడ్డి హాడావుడి కనిపించలేదు .. రాకేష్ రెడ్డి హాడావుడి తగ్గిన తర్వాత ఆకుల గజేంద్ర కొద్ది రోజుల పాటు నియోజకవర్గంలో హల్‌చల్‌ చేశారు .. అయితే ప్రస్తుతం ఆయన కూడా పార్టీలో వున్నారా లేదా అన్న పరిస్థితి కనిపిస్తుంది…


తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలో వికోట నియోజకవర్గానికి చెందిన వెంకటగౌడ్ వైసిపి తరపున ఫోకస్‌ అవుతున్నారు .. ఆయన్నే వైసిపి ఇన్‌ఛార్జ్‌గా నియమించారని అంటున్నారు… ఓ ఎన్జీఓ ద్వారా ప్రజలకు పరిచయమైన వెంకటగౌడ్‌ పార్టీ పెద్దలతో ఒప్పందం కుదర్చుకుని వచ్చారన్న టాక్‌ ఉంది.. ఆ క్రమంలో ఆయన పలమనేరులో భారీ ర్యాలీ నిర్వహించి … గ్రామ పర్యటనల్లో బిజీ అయ్యే పనిలో పడ్డారు..

ఇప్పుడు మరో కృష్ణుడి రూపంలో పవన్ కూమార్ రెడ్డి తెరపైకి వచ్చారు .. తాజాగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అయన పలమనేరులో సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు.. కిలో మీటర్ల మేర ప్లేక్సీలు వేయించారు .. అయితే ప్లేక్సీలలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌నని ప్రకటించిన వెంకటగౌడ్‌ ఫొటో లేక పోవడంతో ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు చింపి వేయడంతో పవన్‌ వర్గం ఆందోళనలకు దిగింది … ఏదేమైనా తాజాగా పవన్‌ నియోజకవర్గ వర్గంలో ఓ గ్రూపును మెయిన్ టెయిన్ చేసే పనిలో ఉన్నారు.. దీంతో ఇప్పుడు ఎవరు ఇన్‌ఛార్జో, ఎవరు ఎన్నికల బరిలో వుంటారో తెలియని స్థితిలో ద్వీతీయ శ్రేణి నాయకులు కొట్టుమిట్టాడాల్సి వస్తోందంట… హాడావుడి చేస్తున్న ప్రతి నాయకుడు తమకు పెద్దాయన అశీస్సులు వున్నాయంటు పెద్దిరెడ్డి పేరు ను చెబుతున్నారని కార్యకర్తలు అవేదన చెందుతున్నారు.


ముందు నుంచి నియోజకవర్గంలో టిడిపికి గట్టి పట్టుంది… గత ఎన్నికల్లో సీనియర్ నాయకుడు , ఎన్నికల మేనేజ్‌మెంట్ తెలిసిన అమర్‌నాథ్ రెడ్డి కూడా వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి ..కేవలం మూడు వేల లోపు ఓట్లతో బయటపడ్డాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు… ఇలాంటి చోట ఏక నాయకత్వాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం వుందని వైసిపి కార్య కర్తలు అంటున్నారు… నిన్నటి వరకు వెంకటగౌడ్ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుంటే .. తాజాగా ఇప్పుడు పవన్‌కూమార్ రెడ్డి ఎంట్రీతో కేడర్‌ కన్‌ఫ్యూజన్లో పడిపోతోంది..

అదలా ఉంటే గతంలో ఇన్‌ఛార్జ్‌ల మంటూ హడావుడి చేసిన రాకేష్ రెడ్డితో పాటు ఆకుల గజేంద్రలు కూడా సెగ్మెంట్లో గ్రూపులను మెయిన్‌టైన్‌ చేస్తుండటం వారిలో గందరగోళాన్ని మరింత పెంచుతోంది .. ఇలాంటి పరిస్థితులలో జిల్లా అగ్ర నాయకత్వం ఏవ్వరు ఇన్‌ఛార్జో, ఎన్నికల క్యాండెట్‌ ఎవరో క్లారిటీ ఇవ్వాలని కేడర్‌ కోరుతోంది.. మరి వారికి ఆ క్లారిటీ ఎప్పటికి దొరుకుతుందో చూడాలి..