Home News Stories

ఓరుగల్లులో ఓటు ప్రమాణాలు…ఓల్డ్ ట్రెండ్ ఫాలోఅవుతున్న గులాబీ దళం….

SHARE

ముందస్తు ఎన్నికల ఫీవర్ ఓరుగల్లులో విచిత్ర రాజకీయాలకు తెర తీస్తుంది. పాత ట్రెండ్ ఫాలో అవుతున్న ఓరుగల్లు టీఆర్ఎస్ నేతల ప్రమాణాలు వివాదాస్పదం అవుతున్నాయి. అభ్యర్థులకు మద్దతు పేరుతో ఓటర్లతో ప్రమాణాలు చేయించడం పై ఒక పక్క ప్రతిపక్షం ఫిర్యాదులకు సిద్దమవుతుంటే….స్వచ్చందంగా ప్రజలే తమ పార్టీకి మద్దతుగా ప్రమాణాలు చేస్తున్నారంటుంది అధికారగులాబీ దళం…..

ఎన్నికల తేదీలు వెల్లడి కావడంతో ఓరుగల్లులో అన్ని పార్టీల నేతలు జనం మద్దతు కుడా గట్టే ప్రయత్నం చేస్తున్నారు. సభలు సమావేశాలతో బిజీ బిజీగా ఉంటున్నారు, వర్తక వ్యాపార సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రచార పర్వం వేగం పెంచారు. మరి ముఖ్యంగా కుల సంఘాల పై దృష్టి సారించారు. కులలా వారిగా మద్దతు కుడా గట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఒక్కొక్క కుల సంఘం నేతలతో వరుస బేటిలు అవుతు వారికి కమ్యూనిటి హాల్స్ ఇస్తాం అనే హామీతో ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు కమ్యూనిటి హాల్ సంభందించిన ప్రోసిడింగ్స్ రెడీగా ఉన్నాయంటూ పత్రాలను చూసిస్తు ఓట్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఫలానా అభ్యర్థికే ఓటు వేస్తాం అంటూ కుల దైవాల పై ప్రమాణాలు చేయడమే ఇప్పుడు వివాదా స్పదం అవుతుంది. నర్సంపేట నియోజక వర్గంలో అదికార పార్టీ నేతలు మండలాల వారిగా ఒక దఫా కుల సంఘాల సమావేశం నిర్వహించారు. అయితే వారికి గ్రూపుల వారీగా హామీలు ఇస్తూ సమావేశానికి వచ్చిన వారితో కుల దైవం పై ప్రమాణాలు చేయిస్తు అధికారపార్టీకే ఓటు వేయాలని తీర్మాణాలు చేయించడం వివాదాన్ని రాజేసింది. దీని పై ఇప్పటికే కాంగ్రెస్,టీడీపీ నేతలు ఎలక్షన్ కమీషన్ కి ఫిర్యాదు చేశారు. రాజ్యంగా విరుద్దంగా కుల దైవాల పై ప్రమాణాలు చేయిస్తున్నారంటూ ప్రమాణాల సీడిలను ఈసీకి అందజేశారు.

ఈ విధంగా ఓరుగల్లులో అరడజనుకు పైగా నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగుతుందని కారు పార్టీనేతలు ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూందంటూ విపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. ఓరుగల్లులో ఇప్పటికే ఏదురీదుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల అత్యుత్సాహంతో మరిన్ని చిక్కుల్లో పడేలా ఉంది.