Home Women Health

స్థూలకాయం+డిప్రెషన్= అంతులేని అలసట

SHARE

ఈమధ్యకాలంలో పది మెట్లు ఎక్కినా, కాసింత దూరం నడిచినా అంతులేని అలసట ఆవహిస్తూ ఉంటుంది. పెద్దగా పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది. రాత్రి తగినంత సేపు నిద్రపోయినా పగటిపూట మగత మగతగా నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. పని మధ్యలో ఆపేసి కాసేపు కునుకుతీయాలని అనిపిస్తుంది.   బరువును పరీక్షించుకోండి. స్థూలకాయానికి తోడు డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు మామూలేనంటున్నారు నిపుణులు.

హైపర్ సోమ్నియా.. అంటే, అతినిద్రతో బాధపడుతున్న వారు ప్రపంచ జనాభాలో దాదాపు ముప్పయి శాతం వరకు ఉంటారని ఒక అంచనా. హైపర్ సోమ్నియా కారణంగా పనితీరు మందగించడమే కాదు, తరచు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి బయట పడేందుకు బరువు తగ్గడమే ఉత్తమమార్గమని వారు సూచిస్తున్నారు.

బరువు తగ్గడం కోసం భోజనం మానేయకుండా వ్యాయామం చేయడం, మంచినీరు ఎక్కువ తాగడం చేయాలి. తేనె, గోరువెచ్చని నీరు కలిపి తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. టీ, కాఫీలు, కూల్ డ్రింక్ మానేసి కొబ్బరిబోండాం నీళ్ళు, నిమ్మరసం తాగితే మంచిది. ఆహారంలో వేపుళ్ళు, నాన్ వెజ్ పక్కనపెట్టి పప్పుచారు, రసం తాగితే మంచిది