Home Entertainment Cinema

ఎన్టీఆర్,రామ్ చరణ్ డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి….

SHARE

దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు. ఎప్పటి నుంచో ఈ క్రేజీ కాంభినేషన్ లో వస్తున్న మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పాడు రాజమౌళి…

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఓ స్పెషల్ తేదీన ప్రారంభం కాబోతోంది. 11-11-11న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 11వ నెల 11వ తారీఖు 11గంటలకు ఈ చిత్రానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసింది. ఇందులో ‘11 11 11’ అని చూపిస్తూ.. ఈ మూడు 11లు మూడు ‘R R R’లుగా మారడంను వీడియోలో చూపించారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌కథానాయకులుగా ఈ మల్టీస్టారర్‌తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పతాకంపై దానయ్య సినిమాను నిర్మించనున్నారు. సెంథిల్‌ సినిమా కెమెరామెన్ ఫిక్స్ అయ్యాడు. ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఆయన ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘మహానటి’ వంటి సూపర్‌హిట్‌సినిమాలకు డైలాగ్స్‌రాశారు. ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్‌సిట్టింగ్స్‌ప్రారంభించారు.

ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. అందులో ఓ కథానాయికగా ఫారెన్ ఫిగర్ ని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురూ ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారట. సమంత, కీర్తి సురేశ్‌, రష్మికలను ఈ సినిమా కోసం అనుకున్నట్లు గతంలో గుసగుసలు వచ్చాయి. అంతేకాదు.. సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని కూడా వెల్లడిస్తారని సమాచారం.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, చరణ్‌సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇందులో వీరు అన్నదమ్ములుగా కనిపించనున్నట్లు తెలిసింది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత జక్కన్న తెరకెక్కించబోతున్న సినిమా కావడంతో దీని పై భారీ అంచనాలు నెలకొన్నాయి.