Home Entertainment Cinema

ఎన్టీఆర్ అరవింద సమేత స్టోరీ ఇదేనా..?

SHARE

ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలుండగా ఈ సినిమా స్టోరి పై కూడా అదే రేంజ్ లో ఎక్సపర్టేషన్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ లో సతమతమవుతున్న త్రివిక్రమ్ ఈ సినిమా పై చాలా అంచనాలే పెట్టుకున్నారు. ఇక యంగ్ టైగర్ తారక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతో కసిగా వర్క్ చేశాడు. ఒక పక్క తండ్రిని కోల్పోయిన బాధలో కూడా షూటింగ్ కి గ్యాప్ ఇవ్వలేదు తారక్. అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది….

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టడంతో తాజాగా ఈ మూవీ పై ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియోట్ అయింది. అరవింద సమేత ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఉన్న అభిమానులకు సినిమా విడుదలకు ముందే స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్ కోంత ఆందోళనకు గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం మనకి ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమా స్టార్టింగ్ లోనే వస్తుందని సమాచారం. జగపతి బాబు ఎన్టీఆర్ ఫామిలీపై దాడి చేయిస్తాడని.. ఆ క్రమంలో ఎన్టీఆర్ తండ్రి నాగబాబు చనిపోవడంతో స్పాట్ లోనే దానికి ప్రతిగా తారక్ అతన్ని చంపేస్తాడని ఇదే స్టోరి లైన్.

జగపతిబాబు ని చంపిన తారక్ ఆ తర్వాత ఇక హింస ఉండదని చదువుల కోసం కాలేజీకి వెళ్లిపోతాడు. కొన్ని కారణాలు వల్ల అరవింద కోసం గ్రామానికి రావాల్సి వస్తుంది తారక్. తీరా చూస్తే జగపతి బాబు బతికే ఉంటాడు. దీంతో ఎన్టీఆర్ మళ్లీ ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసి జగపతి బాబును చంపేస్తాడో? లేదా మాటలతో మారుస్తాడా? అనేది మిగిలిన కథ అంటూ వార్తలు వస్తున్నాయి.

సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ఎమోషనల్ సీన్లతో త్రివిక్రమ్ బాగా డీల్ చేసాడని.. తన మాటలతో ప్రేక్షకులు అందరు కంటతడి పెట్టడం ఖాయమంటున్నారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఒరియంటెడ్ గా ఉన్నా అంత హింస మాత్రం ఉండదని తెలుస్తుంది. ఇందులో యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ అవి ‘సింహాద్రి’, ‘ఆది’ రేంజ్ లో ఉండవని.. త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ ఉంటుందని తెలిసింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల అవుతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా బెనిఫిట్ షోకు ముహూర్తం తెల్లవారు ఝామున 4.50 నిమిషాలకు పెట్టారు. ఇక తెలంగాణలో ఉదయం 6 నుంచి రెగ్యులర్ షోలు స్టార్ట్ కానున్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్స్ రిలీజ్ రోజు నుండి వారం రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కలిపించింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణలో సాధారణ రేట్లకే టికెట్స్ అమ్ముతారని తెలుస్తుంది.