Home Entertainment Cinema

ఎన్టీఆర్ అల్లుడు అదుర్స్…

SHARE

వినాయక చవితి పండుగ రోజు ఎన్టీఆర్ అభిమానులకు మరో స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది ‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌ చిత్ర యూనిట్. రీల్ లైఫ్ భళ్లాల దేవుడు రానా ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్‌ ద్వారా దీనిని విడుదల చేశారు.

‘యన్‌టీఆర్’ చిత్రాన్ని క్రిష్ డైరక్ట్ చేస్తుండగా బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ స్టార్ విద్యా బాలన్‌ నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి టార్గెట్ గా శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ ఈ సినిమా ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

రానా పాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసంలో చిత్రీకరించారు. రీల్ లైఫ్ లో చంద్రబాబు క్యారక్టర్ లో ఒదిగిపోయిన రానా హెయిర్ స్టైల్.. మీసకట్టులో చంద్రబాబు ను అనుకరించటంలో సక్సెస్ అయ్యారు. అన్నట్లు ఈ ఫస్ట్ లుక్ మీద పాజిటివ్ వ్యాఖ్యలతో పాటు సెటైరికల్ పంచ్ లతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది.