Home News Politics

ఈ పార్లమెంట్ కు హస్తం పార్టీ అభ్యర్ధి కావలెను…!

SHARE

ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో హస్తం పార్టీ నుంచి పోటి చేయడానికి అభ్యర్థులే దోరకడంలేదా…
వెతికి వెతికి పార్టీ అదిష్టానం కూడా అలసిపోయిందా…గత ఏన్నికల్లో పోటిచేసి ఓడిపోయిన ఆ మాజీ ఎంపీని మళ్లీ బరిలో దించోద్దని సోంత పార్టీ క్యాడర్ పెదవి విరుపులతో అక్కడి నుంచి పోటీ పై ఆ సారు డిఫెన్స్ లో పడ్డారు.తెరపైకి రోజుకోక కొత్తపేరు ఆ పై అమ్మో మేం పోటీలో లేమంటూ ఖండనలు పక్క పార్టీ వైపూ చూసిన అంతటి సాహసానికి ఎవరు సిద్దపడట్లేదు ఇదంతా నిజామాబాద్ పార్లంమెట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితి….

గెలవడం తర్వాత సంగతి ఇందూరులో కనీసం పోటికి అభ్యర్ధి కూడా దోరకడంలేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఎలా తాయారైందో అర్థమవుతుంది..నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ స్థానంలో పోటిచేయడానికి అభ్యర్థులు దోరకక అన్వేషణ మొదలుపెట్టింది హస్తం పార్టీ. ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంట్ స్తానం నుంచి కాంగ్రెస్ పార్టీలో రేసులో వున్నవారి పేర్లు చెప్పాల్సి వస్తే..కనీసం ఒక్కపేరు కూడ చెప్పలేని పరిస్థితి. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీకీ నేనంటే నేనంటూ పోటీ పడుతుంటే ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ గా వుంది. గత ఏన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేసి ఓడిపోయిన మదుయాష్కి ఈసారి ఇదే సెగ్మెంట్ నుంచి పోటి చేసే అవకాశాలు దాదాపుగా కనబడటంలేదు…

ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకర్గాల్లో ఒక్కస్థానం కూడ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. కనీసం మదుయాష్కి ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరుపున ప్రచారం చేయలేదని పార్టీ శ్రేణుల నుంచి ఓపెన్ గానే విమర్శలు వినిపిస్తున్నాయి..ఏకంగా కోరుట్ల కాంగ్రెస్ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మదుయాష్కి నిజామాబాద్ ,భువనగిరి పార్లమెంట్ స్థానాలలోనే కాదు తెలంగాణలోని 17 ఎంపీ సెగ్మెంట్ లలో ఎక్కడ టికెట్ ఇవ్వోద్దని సోంత పార్టీ నేతలే ఫైరవుతున్నారు. మదుయాష్కి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న బాల్కోండ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లెస్ కాదుకదా ఏకంగా మూడవ ప్లేస్ కు పరిమితమైంది…ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడ సీన్ లో లేరు మధుయాష్కి.

ఇక మదుయాష్కి ఇసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటిచేసే అవకాశాలు కనబడకపోవడంతో పార్టీ అదిష్టానం ఎవరిని బరిలో దింపాలో తెలియక అయోమయంలో ఉంది…ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోదన్ నుంచి పోటి చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ని బరిలోదింపాలని చూస్తుంది కాంగ్రెస్ అదిష్టానం…అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటిచేయడానిని సుదర్శన్ రెడ్డి అంత సముఖత చూపించడంలేదన్న ప్రచారం జరుగుతుంది…ఏవరు పోటిచేయడానికి ముందుకు రాలేకపోతువుండటంతో కాంగ్రెస్ అదిష్టానం బీజేపీ నుంచి నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్న ధర్మపురి అరవింద్ కు గాలం వేస్తుంది…అరవింద్ పార్టీలోకి వస్తే నిజామాబాద్ ఎంపీ సీటు ఇవ్వడానికి పార్టీ అదిష్టానం రెడీగా వుందన్న టాక్ నడుస్తుంది…అయితే అరవింద్ మాత్రం కమలం పార్టీని విడే ప్రసక్తేలేదని తేల్చేశారు.

ఇందూరు పార్లమెంట్ స్థానంకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దోరకకపోవడం మొదటి విషయం అయితే…ఇక్కడ టిఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీ కవిత ఈసారి కూడ నిజామాబాద్ పార్లమెంట్ నుంచే బరిలో దిగాలనే ఆలోచనలో వున్నారట…దీనిలో బాగంగానే ఇటవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిదిలోని ఏడు నియోజకవర్గాల్లో భారీ మోజార్టీతో అభ్యర్ధులు గెలిచేలా గ్రౌండ్ వర్క్ చేశారు కవిత. బోదన్ మినహా ఎక్కడ 20వేల మోజార్టీ తగ్గకుండా టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపోందారు…ఒక్క బోదన్ లో మాత్రమే 8వేల మోజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుపోందింది.

2014లో ఎంపీ కవిత పోటిచేసిన సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో జగిత్యాల లో మాత్రం టీఆర్ఎస్ ఓడిపోయింది..అయితే ఈసారి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పైనే దృష్టి పెట్టిన కవిత జగిత్యాల లలో సైతం టిఆర్ఎస్ జెండా ఎగరవేడయంలో కీలక పాత్ర పోషించారు..వైరల్ ఫీవర్ ని ఏమాత్రం లెక్కచేయకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కోనసాగించారు….దీంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిదిలో ఏడు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఒకవేళ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ కు కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తే గెలిచే అవకాశాలు లేకున్నా కోంత పోటి ఇచ్చే అవకాశం వుంటుంది..

మొత్తానికి ఒకప్పటి కంచుకోటలాంటి ఇందూరులో కనీసం అభ్యర్ధి కూడా దొరకక కుదేలైపోయింది కాంగ్రెస్ పార్టీ.