Home News Politics

సింహపూరిలో బలంగా వీస్తున్న ‘ఫ్యాన్’ గాలి…!

SHARE

ఏపి లో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఉద్యమాలు, పోరాటాల పురిటి గడ్డగా కూడా నెల్లూరు జిల్లా కు పేరుంది. ఇలా ఉద్యమ నేపద్యం నుంచి వచ్చిన పలువురు నేతలు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ కీలకంగా ఎధిగారు. పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్య నాయుడు, బెజవాడ గోపాల్ రెడ్డి, నేదరుమల్లి జనార్దన్ రెడ్డి, వంటి నేతలు రాజకీయాల్లో అత్యు త్తమ పదవులను అలంకరించారు. వీరితో పాటు ఆనం, నల్లపు రెడ్డి, మేకపాటి, నేదరుమల్లి కుంటుంబాలు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ గత ఐదేళ్లలో ఈ కుటుంబాల నుంచి వచ్చిన నేతలే కాకుండా కొత్త తరం నేతలు కూడా జిల్లా రాజకీయాల్లో ఇరు పార్టీల్లోనూ కీలకంగా మారారు. ఇలా కుటుంబా నేపద్యంతో పాటు కొత్త నాయకత్వం తో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.

టిడిపి ఆవిర్బావానికి ముందు వరకు ఈ జిల్లా లో కాంగ్రెస్ హావా కొనసాగింది. కొన్ని చోట్ల కామ్రేడ్లు తమ పట్టును చాటుకున్నా.. క్రమేపి వీరు కనుమరుగైపోయారు. టిడిపి ఆవిర్బావం తరువాత జిల్లాలో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తమ హావాను కొనసాగిస్తుూ వచ్చాయి. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎంపీ స్తానం ఉంది. తిరుపతి పార్లమెంటు పరిదిలో నాలుగు అసెంబ్లీ స్తానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ విజయం సాదించింది. టిడిపి కేవలం మూడు స్థానాలకు పరితిమైంది. వైసిపి నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే టిడిపిలో చేరారు.

వైసిపి కి పట్టున్న జిల్లాలో కడప తరువాత నెల్లూరు కూడా ఒకటి . వైసిపి ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికలతో పాటు 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లా ప్రజలు వైసిపి ని ఆదరించారు. జిల్లాలోని రెండు ఎంపీ స్తానాలతో పాటు ఏఢు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్మెన్ పదవితో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసిపి విజయ కేతనం ఎగరవేసింది. వైసిపి ఆవిర్బావం నుంచి మేకపాటి కుటుంభం జగన్ అండగా నిలిస్తూ వచ్చారు. అలా జిల్లాలో వైసిపి కి పెద్ద దిక్కుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. మారిన పరిస్తితులతో పార్టీలో మేకపాటి పట్టు సడలినా ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా పార్టీలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చారు.

జిల్లాలో జనసేన ప్రబావం పెద్డగా కనిపించదు. జనసేన లో ముఖ్య నేతలు ఎవ్వరూ లేకపోవడంతో జిల్లా ఓటర్లు ఈ పార్టీని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. సిపిఎం పొత్తుతో జనసేన రెండు మూడు నియోజకవర్గాల్లో కొంత మేర మాత్రమే ప్రభావం చూపిస్తుంది . కాంగ్రెస్, బిజేపి ల పరిస్తితి మరింత దారుణం అనే చెప్పాలి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు జిల్లాకు పలు నిదులు తీసుకువచ్చినప్పటికీ .. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బిజేపి నేతలు విఫలం అయ్యారు. కాంగ్రెస్ పరిస్తితి కూడా దాదాపుగా అంతే. పనబాక దంపతులు కూడా టీడీపీలో చేరడంతోపాటు గుర్తింపు ఉన్న నేతలెవ్వరూ లేరు. కాబట్టి జనసేన, బిజేపి, కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికలల్లో నామమాత్రంగానే మారనున్నాయి.

నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని గత ఎన్నికల్లో వైసిపి కైవసం చేసుకుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి టిడిపి అభ్యర్ది ఆదాల ప్రభాకర్ రెడ్డి పై విజయం సాదించారు. పార్లమెంటు పరిదిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసిపి కి భారీ మెజారిటి వచ్చినా లోక్ సభ అభ్యర్ది మేకపాటికి కేవల 13 వేల మెజారిటి మాత్రమే వచ్చింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గట్టి పోటీని ఇచ్చారు. నాటకీయ పరిణామాలతో ఆదాల వైసీపీలో చేరి ఎంపీ అభ్యర్ధి అయ్యారు. బీద మస్తాన్ రావు ను ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల బాలా బలాను పరిశీలిస్తే… నెల్లూరు సిటిలో హోరా హోరి పోరుని తలపిస్తున్న ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా నారాయణ ఉండటం నియోజకవర్గంలో అభివృద్దికి పెద్దపీఠ వేయడం ఆయనకు కలిసొస్తుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ బలంగా ఉన్నారు. జిల్లాలో వైసిపి బలంగా ఉన్న సెగ్మెంట్లలో నెల్లూరు రూరల్ కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసిపి అబ్యర్దిగా కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి గెలుపొందారు. ఆనం కుటుంబాన్ని వ్యతిరేకించిన కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి గత ఎన్నికల్లో అదిక మెజార్టీతో గెలుపొందారు. కోటంరెడ్డి కూడా ప్రతిపక్షం లో ఉన్నప్పటికి నిత్యం ప్రజల మద్యే తిరుగుతుండడం ఆయనకు కలసి వస్తుంది. ఆదాల ఇక్కడ టీడీపీకి షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు.

కావలిలో గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టిడిపి అభ్యర్ది బీద మాస్తాన్ రావు పై గెలుపొందారు. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు కలసి కట్టుగా వైసిపికి పనిచేయడంతో రామిరెడ్డి బీద మస్తాన్ రావు పై గెలుపొందగలిగారు. కానీ ఈ సారి వైసిపి కి కష్టాలు తప్పేలా లావు. విష్ణువర్దన్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకున్నారు. ఇక్కడ విష్ణుకి బీదా వర్గం ఏ మాత్రం సహకరిస్తుందో చూడాలి. సర్వేపల్లిలో పాత ప్రత్యర్ధులే తలపడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఇక్కడ వైసీపీకే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. సుళ్ళూరుపేట,వెంకటగిరి,కొవూరు,ఆత్మకూరులోనూ వైసీపీ హావానే కనిపిస్తుంది.