Home News Politics

నందమూరి ఫ్యామిలికి టిక్కెట్ వెనుక ఇంత కథ ఉందా…?

SHARE

కూకట్‌పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమారై సుహాసిని బరిలోకి దింపడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు పక్క ప్లాన్ తో వెళ్తున్నారు. హరికృష్ణని కోల్పోయిన కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తూనే కూకట్ పల్లిలో ధీటైన అభ్యర్ధిని బరిలో ఉంచి సీటు పదిలం చేసుకున్నారు. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పురందేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపైనే ఉన్నారనే సంకేతాలను టీడీపీ ఇచ్చినట్లయింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అండ్ కో తో ఉన్న గ్యాప్ ను ఈ సీటు ద్వారా సెట్ చేసుకుంటున్నారు చంద్రబాబు. దీంతో టీడీపీ తరుపున ఇక్కడ నందమూరి కుటుంబసభ్యులందరిని కలిసికట్టుగా ప్రచార బరిలోకి దింపబోతున్నారు.

సీఎం చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే ప్రత్యర్థులను డిఫెన్స్‌లోకి పడేశారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందన్న విమర్శలకు సెంటిమెంట్‌తో సమాధానం చెప్పడంతో పాటు, ఇటు నందమూరి కుటుంబాన్ని ఏకతాటి పైకి తీసుకోచ్చే ఫ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మహాకూటమి విజయానికి దోహదపడాలంటే సుహాసినిని అభ్యర్ధిగా ప్రకటిస్తే అన్ని స్ధానాలపై ఈ ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా మిగతా అభ్యర్ధులకు కూడా సుహాసిని బరిలోకి దిగడం కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. మరోవైపు మహాకూటమి తరపున బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఎలాగు ఈమెను రంగంలోకి దింపడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం మద్దతు ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది.

నందమూరి సుహసిని హరికృష్ణ కి రెండో సంతానం. హరికృష్ణ పెద్ద కుమార్డు జానకీ రామ్ తర్వాత పుట్టిన ఆడపిల్ల.పడాల రామిరెడ్డి లా కళాశాలలో లా కంప్లీట్ చేసిన సుహాసిని భర్త వ్యాపారవేత్త. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కోడలు. సుహసినికి ఒక కొడుకు.. బీటెక్ చదివారు. గతంలో హరికృష్ణ కూడా టీడీపీ నుంచి ఎంపీగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆయన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు భావించారు. దీంతో సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కూకట్‌పల్లి నుంచి టికెట్ ఆశించిన ఆశావాహులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సుహాసినికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. కూకట్‌పల్లి టికెట్‌ను పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాస్‌ ఆశించారు. వీరితో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలుస్తోంది.


అయితే సుహాసిని కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో హరికృష్ణ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే నల్గొండ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు లేవు. అయితే నందమూరి కుటుంబం మూడో తరంలో ఆయన మనవరాలు సుహాసిని తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.