Home News Stories

నల్గొండ పార్లమెంట్ లో గులాబీకి వార్నింగ్ బెల్స్….!

SHARE

కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్గొండ జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ హవా కొనసాగింది … అయితే ఆ స్థాయి జోరును పంచాయతీ ఎన్నికలో కొనసాగించలేకపోవడం చర్చనీయాంశం అయిందిప్పుడు .. పంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలు గెలుపొందినా… అధికారపక్ష నేతల్లో ఆ సంతృప్తి కనపడటం లేదు .. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన దేవరకొండ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఎదురవ్వడం గులాబీశ్రేణుల్లో గుబులు రేపుతోందట .. దాంతో లోక్‌సభ ఎన్నికల కోసం చేయాల్సిన కసరత్తుపై ఇప్పటి నుంచే మల్లగుల్లాలు పడుతున్నారు ఆ పార్టీ నేతలు

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికల మాదిరి, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతీయాలనుకున్న టిఆర్ఎస్ ఆశలు అంతగా ఫలించలేదు .. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని 215 గ్రామపంచాయతీల్లో, 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో టీఆర్‌ఎస్‌ 35 సర్పంచ్ స్థానాలు సాధించినా… ఇదే జోరును మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో చూపించలేకపోయిoది .. ఎన్నికలు జరిగిన 172 పంచాయతీల్లో 107 టిఆర్‌ఎస్‌ దక్కించుకోగా .. మిగతా 65 స్థానాల్లో 57 కాంగ్రెస్, 4 సీపీఐ,4 ఇతరులు గెలుచుకున్నారు ..

టిఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుపొందిన పంచాయతీల్లో ఒకటి, రెండూ తప్ప మిగతావి చిన్న గ్రామపంచాయతీలతో పాటు, గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ గిరిజన తండాలే .. ఇక పోటీ జరిగిన పంచాయతీల్లో ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ల ప్రధాన అనుచరులు సైతం పలువురు ఓటమి పాలవ్వగా … కొందరు అతి కష్టం మీద బయట పడ్డారు …తమకు,తమ అనుచరులకు పట్టుందనుకున్న పంచాయతీల్లో సైతం ముఖ్యనేతలకు చుక్కెదురైంది .. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనుకున్న వివిధ మేజర్‌ పంచాయతీలు సైతం కాంగ్రెస్ చేజిక్కించుకోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు అంతర్మధనం చెందుతున్నారంట…

శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ప్రతి మండలం నుంచి టీఆరెస్ కు ఐదు నుండి ఆరు వేల మెజారిటీ వచ్చింది… అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన చోట్ల అది వందలకే పరిమితమైంది .. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభంజనం, ఎంపీ గుత్తా మద్దతుతో 215 గ్రామపంచాయతీలకు గాను, 200 పైచిలుకు పంచాయతీల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన రవీంద్రకుమార్, నెల రోజుల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆప్రభావం చూపించలేకపోవడం ఆపార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది .. పంచాయతీ ఫలితాలను నిశితంగా పరిశీలించిన గుత్తా, రవీంద్రకుమార్ లు… జడ్పి చైర్మన్ బాలునాయక్ వ్యూహాలతో కాంగ్రెస్ పుంజుకుందని … కాంగ్రెస్, సీపీఐ మైత్రి ఫలించిందని అంటున్నారట ఇప్పుడు .. నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం రిజల్ట్స్‌పై పార్టీ పెద్దలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. మరి పార్లమెంట్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సదరు ఎంపి, ఎమ్మెల్యేలు ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఎలా ఉంటాయో చూడాలి…

కాంగ్రెస్ నుంచి కూడా పార్లమెంట్ టిక్కెట్ కోసం అప్పుడే పోటీ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన సీనియర్లు కోమటి రెడ్డి,జానారెడ్డి,ఉత్తమ్ పద్మావతి ఎంపీ టిక్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడ తమకు ఉపయోగపడుతుందని ఆశాభావంతో ఉన్నారు. గులాబీ దళం నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పార్టీ అధినేత కేసీఆర్ అంటూ రకరకాల పేర్లు తెర పైకి వస్తున్నాయి. అయితే ఫైనల్ డెషిషన్ మాత్రమే గులాబీ బాస్ దే…