Home News Politics

నగరిలో రోజా ని ఓడిస్తానంటున్న కాంగ్రెస్ నేత…

SHARE

ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్, రెండు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు కాని వివిధ కారణాలతో పొలిటికల్ లైం లైట్ లో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తిరిగి యాక్టివ్ అవుతున్నారు. తన ప్యూహాలకు పదును పెట్టి కాంగ్రెస్ నుంచే తిరిగి పోటికి సై అంటున్నారు. నగరిలో రోజాని ఇంటికి పంపిస్తా అంటున్నారు. ఎవరా నాయకుడు ఏమిటా కథ….

చిత్తురు జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎవరంటే టక్కున గుర్తోచ్చేది మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి. ఇందిర టైం నుంచి కాంగ్రెస్ పార్టీతో మంచి ర్యాపో ఉన్న లీడర్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో ఉనికి కోల్పోయినా కాంగ్రెస్ లోనే కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్ని కల్లో తన కూతురు ప్రియదర్శిని ని కాంగ్రెస్ తరుపున బరిలో దించారు. కాని విభజన పరిణామాలతో ఆమె కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపొయారు. అప్పటికే చెంగారెడ్డి వర్గానికి చెందిన నాయకులు వైసీపీలోకి వెళ్ళారు.

అయితే తాజాగా నగరి నియూజకవర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గాలి ముద్దుకృష్ణమ నాయుడి మరణంతో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ విషయంలో కన్ ఫ్యూజన్ లో ఉంది. దాంతో పాటు గాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తనకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు చెంగారెడ్డి. కాంగ్రెస్ పై ఇప్పుడు ప్రజల్లో అంత వ్యతిరేకత లేదని తన పాత క్యాడర్ ని మచ్చిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

నగరి ప్రస్థుత ఎమ్మెల్యే రోజా వ్యవహారశైలి నచ్చక వైసీపీలోని ఒక వర్గం కూడా వ్యతిరేకంగా తయరవ్వడంతో ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ ప్యూహం పన్నుతున్నారు చెంగారెడ్డి. తాజాగా నగరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన వర్గంతో సమావేశం నిర్వహించిన చెంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే బరిలోకి దిగుతున్నాని తనతో నియోజకవర్గం లో పోటిపడే నాయకులు లేరని రోజాకు సవాల్ విసురుతున్నారు.