Home Entertainment Reviews

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ


స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ (సూర్య) ఆర్మీ మ్యాన్.. ఆర్మీ లో సీనియర్ ఆఫీసర్ ని కోపంతో కొట్టడంతో అతన్ని ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ అతనికి బోర్డర్ లో పనిచేయాలని చిరకాల కోరిక. బోర్డర్ లో పనిచేయాలంటే సూర్యని అతని తండ్రి (అర్జున్) నుంచి పర్మిషన్ తీసుకురమ్మంటారు. కావాలనే కండిషన్ పెడతారు. ఎందుకంటే సూర్య ప్రవర్తన నచ్చక అతన్ని ఫ్యామిలీ కి దూరం చేస్తాడు తండ్రి రామకృష్ణం రాజు (అర్జున్ ). ఆయన సైకాలజీ ప్రొఫెసర్.

బన్నీ లాంటి అగ్రశ్రేణి హీరో ని వక్కంతం వంశీ హ్యాండిల్ చేయలేడని తేలిపోయింది

సూర్యకి తండ్రి బోర్డర్ లో పనిచేయడానికి సంతకం పెట్టాడా?

సూర్య అతిగా ప్రేమించిన వర్ష (అను ఇమాన్యుయల్)కి ఎందుకు దూరమయ్యాడు?

శరత్ కుమార్ ఎవరు? అతనితో ఎందుకు వైరం?

ఈ దేశం కోసం సూర్య ఏం చేశాడు? ఇదీ అసలు లైన్.

బన్నీ తన రోల్ కోసం చాలా కష్టపడాడు. కొత్త స్టెప్స్ వేశాడు. కానీ డైరెక్టర్ వక్కంతం వంశీ బన్నీని పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఇతర నటీనటుల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. లవ్ సీన్స్ చక్కగా తీయచ్చు. కానీ తుస్ మనిపించాడు దర్శకుడు.ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తిగా లేదు.

ఎన్నో హిట్ మూవీస్ కి స్టోరీ అందించిన వక్కంతం వంశీ మెగా ఫోన్ పడుతున్నాదంటే ఓహో అనుకున్నారు. తన కోసం దాచుకున్న బలమైన కధతో డైరెక్షణ్ చేస్తాడని అనుకున్నారు. కానీ కధ కూడా  పేలవంగా తేలిపోయింది. ఆర్మీ ఆఫీసర్ నేపథ్యంలో ఎంచుకున్న కదా చాలా వీక్. బన్నీ దేశం కోసం ఎదో ఇరగాదీసేస్తాడని  చూస్తె అక్కడ అలాంటిది ఏమీ ఉండదు. మొత్తం సినిమా కధనంలో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ 40 నిమిషాలు. హీరో హీరోయిన్ ల మధ్య పేలవమైన లవ్ ట్రాక్.

బన్నీ లాంటి అగ్రశ్రేణి హీరో ని వక్కంతం వంశీ హ్యాండిల్ చేయలేడని తేలిపోయింది.

ప్లస్ పాయింట్స్
హీరో క్యారక్టరైజేషన్
యాక్షన్ ఎలిమెంట్
విశాల్ – శేఖర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
వీక్ స్టోరీ
నేరేషన్
పడుతూ పడుతూ లేచి కింద పడిన కథనం
సోది స్టొరీ … వెస్ట్ రన్ టైం
నవ్వురాని కామెడి
హీరోయిన్ రోల్ వెస్ట్
విలనిజం వీక్

రేటింగ్: 2.5

నా పేరు సూర్య పబ్లిక్/ఫాన్స్ టాక్