Home Women Recipes

మటన్ పెప్పర్ ఫ్రై

SHARE


మటన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం
కావలసిన పదార్థాలు :
మటన్ (ఎముకలు లేనిది) : 500 గ్రా., రిఫైన్డ్ ఆయిల్ : 75 గ్రా., ఉల్లిపాయలు: 100 గ్రా., టమాటాలు : 150 గ్రా., సోంపు : 5 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాలు : 10 గ్రా., మిరియాలు : 15 గ్రా., పసుపు : చిటికెడు, కొబ్బరి : 50 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద : రెండు టీస్పూన్లు, గరంమసాలా : పావు టీస్పూన్, ఉప్పు : రుచికి తగినంత

తయారుచేసే పద్ధతి :
ముందుగా అడుగు దళసరిగా ఉన్న గిన్నెలో రిఫైన్డ్ ఆయిల్ పోసి స్టౌ మీద పెట్టి వేడిచేయండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో సోంపు, గరంమసాలా, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని వేసి దోరగా వేయించండి.
తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాక.. అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ముందుగా కోసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసి బాగా కలపండి. దానికి తగినంత ఉప్పును జతచేసి మటన్ బాగా ఉడికేంత వరకు వేడిచేయండి.

ఇప్పుడు మటన్ మెత్తగా ఉడకగానే టమాటా గుజ్జును వేసి బాగా ఫ్రై చేయండి. దానిపై కొంచెం మిరియాల పొడిని జల్లండి. అంతే వేడివేడిగా ఉండే మటన్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే.