Home Entertainment Cinema

పెళ్లి పీఠాలు ఎక్కనున్న దేవిశ్రీ …ఇండస్ట్రీ నుంచే లైఫ్ పార్టనర్…?

SHARE

స్టార్ మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ పెళ్ళి పీఠలు ఎక్కబోతున్నారు. దేవీ పెళ్ళి గురించి ఇండస్ట్రీలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమద్య ఈయన ఒక హీరోయిన్ తో డీప్ లవ్ లో ఉన్నట్లుగా పుకార్లు షికారు చేశాయి. తన పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

తెలుగు,తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఒక నటితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చిన్న చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఒక పెద్ద సినిమాలో కూడా కొన్ని నిమిషాల పాటు కనిపించింది. ఆచిత్రం తర్వాత కూడా ఈమె పలు సినిమాలు చేస్తూ వస్తోంది. ఒక సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం అయ్యిందని కొందరు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కుటుంబ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.

గతంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త సీరియస్ గా పుకార్లు వినిపిస్తున్న కారణంగా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి అవ్వడం ఖాయంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్థుతం ఎవరికి అందుబాటులో లేనప్పటికి ఎదో సమ్ థింగ్ స్పెషల్ న్యూస్ మాత్రం ఉందంటున్నారు సినీజనాలు . త్వరలోనే ఈ వార్త నిజమే అంటూ ఆయన నుండి ప్రకటన రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.