Home News Politics

మొన్న ఆటో…ఇవ్వాళ అంబులెన్స్ ఎంటి కథ….

SHARE

మొన్న ఆటో వచ్చింది. ఇవ్వాళ అంబులెన్స్ వచ్చింది. జగన్ విజయనగరం ప్రజాసంకల్పయాత్ర బహిరంగసభల్లో ఇలా ఎందుకు జరుగుతుంది. అది కూడా ఆరోగ్యశ్రీ గురించి వైసీపీ అధినేత మాట్లాడుతున్నప్పుడే ఇలా ఎందుకు జరుగుతుంది. కుయ్ కుయ్ వెనుక ఉన్న అసలు కథేంటీ…

అది విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జగన్ బహిరంగసభ. జగన్ మాట్లాడుతున్నప్పుడే గర్భిణి ని హాస్పిటల్ కి అత్యవసరంగా తీసుకెళ్తున్న ఆటో అటుగా వచ్చింది. వెంటనే ప్రసంగాన్ని ఆపిన జగన్ అందరు పక్కకు జరగండి అంటూ డైరక్షన్ ఇస్తూ ఆ ఆటో అంబులెన్స్ నుంచి జనం నుంచి బయటకు పంపాడు. సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ఓ 108 వచ్చింది. దానికి కూడా జగన్ దారిచ్చి పంపాడు.మొన్న తాను 108 దుస్థితిని ప్రశ్నించినందుకే చంద్రబాబు ఇవ్వాళ బహిరంగ సభలోకి 108 వెహికల్ ని పంపాడన్నారు. అసలు ఆ 108లో పేషెంట్ ఎవరు లేరని వెళ్ళండి వెళ్ళండి అంటు సెటైర్లు వేశారు.

రాజకీయాల్లో కుయుక్తులు సహజం. తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నోళ్లు చెబుతున్న మాటలు తప్పన్నట్లుగా చిత్రీకరించటం మామూలే. తాజాగా అలాంటి పనే బాబు ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామల పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

పక్క వీధిలో నుంచి 108 అంబులెన్స్ వెళ్లే వీలున్నా.. అలా కాకుండా.. సభ వైపు రావటం వెనుక అధికారపక్షం కుట్ర ఉందన్నారు వైసీపీ అధినేత. అయినా.. వారి నికృష్ట ఆలోచల్ని వదిలేద్దాం.. మనం మాత్రం మంచిగానే వ్యవహరిద్దాం అంటూ అంబులెన్స్ లకు దారి ఇద్దామని రిక్వెస్ట్ చేసి.. అంబులెన్స్ కు దారి ఇచ్చే వరకూ.. దానికి దారి ఇవ్వాలని చెబుతూ.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

మొత్తానికి జగన్ అన్నట్లు ప్రభుత్వం కావాలనే ఇది చేసిందా..? లేకా నిజంగా ఆ అంబులెన్స్ లో ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు జగన్ వ్యక్త పరిచిన అభిప్రాయాన్ని బట్టి చూస్తే.. ఇది నిజంగా 108 అంబులెన్స్ రాజకీయంగానే కనిపిస్తుంది.