Home News Stories

ఆ నీచుడు చ‌చ్చిపోయాడా?

దాచేప‌ల్లి ఘ‌ట‌న‌లో స‌స్పెన్స్‌

బాలిక‌పై అత్యాచారంతో ఆ ఊరు భ‌గ్గుమంది. ఈ దేశంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు గంట‌కొకటి జ‌రుగుతున్నా దాచేప‌ల్లి సంఘ‌ట‌న‌తో జనాగ్ర‌హం పెల్లుబుకింది. ఎక్క‌డో క‌థువాలో ఓ బాలిక‌పై జ‌రిగిన దారుణంతోనే కంట‌త‌డిపెట్టిన జ‌నం దాచేప‌ల్లిలో తొమ్మిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన దారుణంతో ర‌గిలిపోతున్నారు. స్వ‌యానా సీఎం, డీజీపీ జోక్యం చేసుకునేదాకా వెళ్లింది.

ఊరికే ఓ మాట‌నేసి ఎట‌న్నా ప‌రార‌య్యాడా? లేదంటే నిజంగానే కృష్ణ‌లో దూకి ప్రాణాలు తీసుకున్నాడో తెలీదు. వాడు ప్రాణాల‌తోనో, నిర్జీవంగానో దొరికితే త‌ప్ప జ‌నం ఆగ్ర‌హం చ‌ల్లారేలా లేదు.

నిందితుడు దొరికితే జ‌న‌మే చంపేసేలా ఉన్నారు. కానీ ఆ నిందితుడే ప్రాణ‌భ‌యంతో ముందే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అనుమానిస్తున్నారు. ప‌శ్చాత్తాపంతో కాదు…ఎవ‌రికి చిక్కినా ఎలాగూ బ‌త‌కనివ్వ‌ర‌నే భ‌యంతో.
తాతా అంటూ ఆప్యాయంగా పిలిచే మన‌వ‌రాలి వ‌య‌సున్న ప‌సిదాన్ని చిదిమేశాడు రామ‌సుబ్బ‌య్య అనే నీచుడు. ఇద్ద‌రు పెళ్లాలు అత‌నితో వేగ‌లేక వెళ్లిపోయారు. ఇర‌వై ఏళ్లుగా ఒంట‌రిగా ఉంటూ త‌న రిక్షాలో పిల్ల‌ల్ని స‌ర‌దాగా తిప్పే రామ‌సుబ్బ‌య్య‌లో బ‌య‌టికి క‌నిపించ‌ని రాక్ష‌సుడు దాగున్నాడ‌ని ఎవ‌రూ అనుమానించ‌లేక‌పోయారు. ఇంటి స‌మీపంలోనే ఉండే ఓ బాలిక‌ను చాక్లెట్ కొనిస్తాన‌ని ప్ర‌లోభ‌పెట్టి తీసుకెళ్లాడు. ఆ బాలిక‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాక ఎవ‌రికీ చెప్పొద్ద‌ని బెదిరించి మ‌ళ్లీ ఇంటిముందు వ‌దిలేసి వెళ్లాడు. అత‌నిలో దాగున్న మృగాన్ని ఇన్నేళ్లూ క‌నిపెట్ట‌లేక‌పోయిన పాప త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. గ‌తంలో కూడా ఈ దుర్మార్గుడు ఇలాగే కొంద‌రు చిన్నారుల‌పై అఘాయిత్యానికి పాల్ప‌డి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు.

జ‌నం రాష్ట్ర ర‌హ‌దారిని దిగ్బంధించినా, నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నా, విప‌క్ష‌పార్టీల నేత‌ల ప‌రామ‌ర్శ‌లు, విమ‌ర్శ‌ల‌తో వాతావ‌ర‌ణం వేడెక్కినా ఆ నీచ్‌క‌మీనే మాత్రం దొర‌క‌లేదు. ఎందుకింత దారుణం చేశావ‌ని బంధువులు ఫోన్ చేస్తే తాను చ‌చ్చిపోతున్నాన‌ని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడ‌ట ఆ మాన‌వ‌మృగం. పోలీసులు ఎంత గాలించినా ఎక్క‌డా దొర‌క‌డంలేదు. ఊరికే ఓ మాట‌నేసి ఎట‌న్నా ప‌రార‌య్యాడా? లేదంటే నిజంగానే కృష్ణ‌లో దూకి ప్రాణాలు తీసుకున్నాడో తెలీదు. వాడు ప్రాణాల‌తోనో, నిర్జీవంగానో దొరికితే త‌ప్ప జ‌నం ఆగ్ర‌హం చ‌ల్లారేలా లేదు.