Home Entertainment Cinema

మీటూలో ఆ పేర్లు విని షాక్ తిన్నా..!

SHARE

‘మీటూ’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. మహిళాలోకం గతంలోనూ ఇప్పుడూ వారు ఎదుర్కొన్న వేధింపులను మూకుమ్మడిగా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. వీటన్నింటికీ దూరంగా ఎప్పుడూ తనలోకంలో ఉండే ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ మీటూమూమెంట్ పై స్పందించారు. ఈ పేర్లు విని తాను చాలా షాకు కు గురయ్యానంటూ తెలిపారు.

తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా మీటూ మూమెంట్ ప్రభావాన్ని గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను పలువురు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది సినీ మేధావులు, పెద్దల పేర్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఈ మీటూ మూమెంట్ గురించి రెహమాన్‌ స్పందిస్తూ… ‘తనకు తెలిసిన కొంత మంది ‘మీటూ’ ఉద్యమంలో భాగమయ్యారని విని షాక్‌కు గురయ్యా అన్నారు. ఇలాంటి బాధితులు, నిందితులు.. ఇద్దరికీ చెబుతున్నా. మన సినిమా పరిశ్రమ క్లీన్‌గా, మహిళల్ని గౌరవించే విధంగా ఉండాలని నా ఆశ. ధైర్యంగా తమ వేధింపుల గురించి చెప్పిన బాధితులకు దేవుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, విజయం అందుకోవడానికి వీలుగా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను, నా బృందం నిర్ణయించుకున్నాం. బాధితులు స్వేచ్ఛగా మాట్లాడే వీలును సోషల్‌ మీడియా కల్పిస్తోంది.

ఏదేమైనప్పటికీ ఇంటర్నెట్‌లో న్యాయం, అన్యాయం గురించి ప్రస్తావించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది’ అని రెహమాన్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే రెహ్మాన్ ట్వీట్‌కు సంగీత దర్శకురాలు చిన్మయి శ్రీపాద రీట్వీట్‌ చేశారు. ధన్యవాదాలు అంటూ… బాధతో కన్నీరు పెట్టుకుంటున్న ఎమోజీని పంచుకున్నారు.