Home News Politics

మ్యాట్రిక్స్ ప్రసాద్ చేతికి 10టీవీ? వెనుక ఎవరున్నారు?

మ్యాట్రిక్స్ ప్రసాద్ చేతికి 10టీవీ? వెనుక ఎవరున్నారు?

SHARE


మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు ప్రజల నాడి మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. కోట్లాది వ్యవహారం ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో వివిధ పార్టీలు తమ దృష్టిని సారిస్తున్నాయి. ఇక్కడ తాజా విషయం ఏమిటంటే మా టీవీని స్టార్ కి అమ్మేసిన మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇప్పుడు న్యూస్ ఛానెల్ వ్యాపారంలోకి రాబోతున్నారు. ఇప్పటికిప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ ఈ న్యూస్ ఛానెల్ వైపు ఎందుకు దృష్టి పెట్టారు. దీని వెనుక ఉన్నది వైఎస్ జగనా? పవన్ కల్యానా?

మ్యాట్రిక్స్ ప్రసాద్ చేతికి 10టీవీ? వెనుక ఎవరున్నారు?

సిపీఐ అధ్వర్యంలో నడిచే 10 టీవీని కొనుగోలు చేయడానికి మ్యాట్రిక్స్ ప్రసాద్ దృష్టి పెట్టాడని, మాటామంతీ అంతా పూర్తీ అయిందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రం పెండింగ్ అన్నది ఇప్పుడు మీడియా వర్గాల్లో టాక్. ఇంతకీ దీని వెనుక ఉన్నది ఎవరు? మ్యాట్రిక్స్ సంస్థ అధినేతగా పాపులర్ అయి ఆ తర్వాత మా టీవీ లో మేజర్ స్టేక్ కొనుగోలు చేసి మా టీవీ ప్రసాద్ గా మారిపోయారు. మా లో ఈయనకి నాగార్జున, చిరంజీవి ప్రధాన భాగస్వాములు. చిరంజీవి ఫ్యామిలీ తో మ్యాట్రిక్స్ ప్రసాద్ కి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మరో పక్క జగన్ కేసులో మ్యాట్రిక్స్ ప్రసాద్ పేరు కూడా ఉంది. జగన్ తో సంబంధాలున్నాయి.

గత కొంత కాలంగా సిపీఎం అధ్వర్యంలో నడిచే 99 టీవీ చానెల్ ని పవన్ కళ్యాన్ లీజ్ కి తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే అది పట్టాలు ఎక్కలేదు. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ తీసుకునే 10టీవీ వెనుక జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్ సొంత ఛానెల్ లో మాత్రమే వైసీపీ కి అనుకూల వార్తలు వస్తున్నాయి. ఇతర ఛానెల్స్ పెద్దగా ప్రచారం కల్పించడం లేదు. ఇటీవల జగన్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ… కత్తి మహెష్ కి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యలపై తానూ చేస్తున్న యాత్రకు ఇవ్వడం లేదని అన్నారంట.

మరో ఛానెల్ ఉండటం ఎన్నికల దృష్ట్యా చాలా అవసరం. ఈ మేరకు మ్యాట్రిక్స్ ప్రసాద్ 10 టీవీ కొనుగోలు ఆలోచన వెనుక జగన్ ఉన్నట్లు చెప్తున్నారు.