Home Entertainment Cinema

నిప్పు రాజేసిన ప్రిన్స్ మహేశ్ ట్వీట్…

SHARE

తెలిసిన వాళ్ళ సినిమాలు కదా కాస్త ప్రమోట్ చేద్దామంటూ సోషల్ మీడియా వేదికగా వారు చేసిన ట్వీట్స్ విమర్శలకు దారి తీసాయి. సోషల్ మీడియా ఒక రేంజ్ లో ఉండడంతో సెలబ్రిటీలంతా వీటినే వేదికగా చేసుకుని తమ సందేశాల్నిఅందిస్తున్నారు. అలా తన సినిమాలతో పాటు ఇతర చిత్రాలకు సంబంధించిన విషయాల్నికూడా ట్వీట్స్ చేసే హీరోలు తరచు చిక్కుల్లో పడుతుంటారు. ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు ప్రిన్స్ మహేశ్.

ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న మహేశ్.. తాజాగా ‘సర్కార్’ గురించి పెట్టిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సర్కార్’ చూసిన మహేశ్.. ఈ పొలిటికల్ డ్రామా ఎంగేజింగ్ గా ఉందని ఆద్యంతం ఎంజాయ్ చేశానని మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ ‘సర్కార్’ అంటూ ట్వీట్ ద్వారా తెలిపాడు. అయితే ఈ ట్వీట్ ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

నిన్న జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ లాంచ్ గురించి అభిమానుల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అరుదైన కలయికగా అభివర్ణిస్తూ సెలెబ్రిటీలు ట్వీట్లు పెడుతున్నారు. నిన్న టాక్సీ వాలా లాంచ్ కు వెళ్లిన అల్లు అర్జున్ ఈవెంట్ తో సంబంధం లేకపోయినా ప్రత్యేకంగా ఆర్ ఆర్ ఆర్ గురించి ప్రస్తావించి చరణ్ తారక్ రాజమౌళిలకు విషెస్ చెప్పాడు. ఇక ట్విట్టర్ వేదికగా వచ్చిన అభినందనల వెల్లువకు లెక్కే లేదు. సహజంగానే మహేష్ బాబు దీని గురించి ఏదైనా ప్రస్తావిస్తాడేమో అని ఎదురు చూసారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా ఎలాంటి అప్ డేట్ లేదు. తెలుగులో అంతగా స్పందన దక్కించుకోలేకపోయిన సర్కార్-నవాబ్ ల గురించి ప్రత్యేకంగా పొగుడుతూ ట్వీట్ చేసిన మహేష్ ఇంత పెద్ద ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఎక్కడో అనువాద చిత్రం ‘సర్కార్’‌కు స్పందించిన మహేశ్.. తెలుగు సినిమా ‘అరవింద సమేత’ గురించి ఎందుకు మాట్లాడలేదంటూ తారక్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ విమర్శకుల ప్రశంసలు పొంది భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం గురించి పలువురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్ సోషల్ మీడియాలో ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. ఎన్టీఆర్ నటనను, త్రివిక్రమ్‌ను ఆకాశానికెత్తేశారు. అయితే మహేశ్ ‘అరవింద సమేత’ గురించి స్పందించలేదు.

మురుగదాస్‌తో ‘స్పైడర్’ చేశాడు కాబట్టే మహేశ్ ‘సర్కార్’పై స్పందించాడని సరిపెట్టుకున్నా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్‌తో కూడా మహేశ్ సినిమా చేశాడు కదా? అనే కామెంట్స్ వదులుతున్నారు. మహేశ్ ‘అరవింద సమేత’ సినిమా చూశాడా? లేదా? అనేది అప్రస్తుతం. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు ప్రిన్స్ వ్యక్తిగతంగా విషెస్ తెలిపి ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్‌కు ఇవేమీ పట్టవుగా. మరి మహేశ్ ‘సర్కార్’ ట్వీట్ ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.