Home News Stories

ఎక్కడో తేడా కొడుతున్న ప్రజాకూటమి పొత్తులు…..కోదండకు సీఎం సీటా…?

SHARE

ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందా ? .. సీట్ల సర్దుబాటుపై రహస్య భేటీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. దానిపై కోదండరాం పార్టీతో కాంగ్రెస్‌ మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే కోదండ మాత్రం కాంగ్రెస్‌కు కూటమిని నడిపించే సామర్ధ్యం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఆ క్రమంలో టిజెఎస్‌ నేతలు కొత్తగా పెట్టిన ప్రతిపాదన ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది…

ప్రజాకూటమి సీట్ల లెక్కలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్నా… దానిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పై.. రహస్య భేటీ లు జరుగుతూనే ఉన్నాయి.. జనసమితిని దారిలోకి తెచ్చుకోవడానికి తీవ్ర కసరత్తే చేస్తోంది కాంగ్రెస్. .. జనసమితి 12 సీట్లు కావాలని అడుగుతోంది .. అయితే కాంగ్రెస్ 9 సీట్లు ఇస్తానంటోంది .. మరీ కాదూ కూడదంటే మరో సీటు పెంచే అవకాశం ఉందంటున్నారు..

కానీ కోదండరామ్ మాత్రం కాంగ్రెస్ తీరు పట్ల కొంత అసంతృప్తి తో ఉన్నారు. .. కూటమి లీడ్ చేయాల్సిన పద్దతిపై కాంగ్రెస్ కి అవగాహన లేదని చురకలు అంటిస్తున్నారాయన. జనసమితి సీట్ల వ్యవహారం పై చర్చలు ఒక పట్టాన తేలేటట్లు కనిపించడం లేదు .. . 9 నుంచి 10 సీట్లు ఇస్తామంటున్న కాంగ్రెస్‌ ఎక్కడ ఇస్తారు..ఏమిస్తారో చెప్పకుండా నాన్చుతుందని జనసమితి నేతలు చికాకు పడిపోతున్నారు .. కూటమి నుంచి ఎలాగూ బయటకు వెళ్లమన్న ధీమాతోనే కాంగ్రెస్‌ అలా నాన్చుడు ధోరణి అవలంభిస్తుందంటున్నారు.. కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవటంతో తన పార్టీ నాయకులకు కూడా ఏం చెప్పాలన్నది క్లారిటీ లేకుండా పోతోందని తెగ ఇదై పోతున్నారు కోదండ..

అదలా ఉంటే కోదండరాం ఖచ్చితంగా పోటీ చేయాలంటున్నారు జనసమితి నేతలు.. ప్రజలు కోదండను నమ్ముతున్నారని.. కూటమికి ఛైర్మన్‌గా ఆయన ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.. అలాగే కోదండరాంను సీఎం క్యాండెట్‌గా ప్రకటిస్తే .. తమకు సీట్లు కూడా అవసరం లేదని కొత్త ప్రపోజల్‌ తెరమీదకు తెస్తున్నారు.. అదే ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది