Home News Stories

మాగంటికి టిక్కెట్ డౌటే నా ?

SHARE

పశ్చి మగోదావరిజిల్లాలో మరోసారి తమ పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతోంది తెలుగుదేశం పార్టీ… గత ఎన్నికల్లో మొత్తం సీట్లు తమఖాతాలో వేసుకుని అధికారం దక్కించుకున్న టీడిపి వచ్చే ఎన్నికల్లోను అదే సీన్ రిపీట్ చేయాలనుకుంటోంది…. అందులో భాగంగానే అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలోని నాయకులపై ఒక కన్నేసి ఉంచింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపుగుర్రాలకు సీటివ్వాలని భావిస్తున్న తెలుగు దేశం పార్టీ ఇపుడున్న సిట్టింగ్ లీడర్లను అవసరమైతే పక్కనబెట్టబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి… 2019ఎన్నికల్లో సీటు కోల్పోబోతున్నట్టుగా వినిపిస్తున్న పేరు ఏలూరు యంపీ మాగంటి బాబు. ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానానికి కొత్త అభ్యర్ధికి అవకాశం ఇవ్వబోతున్నట్టు టాక్.

గోదావరిజిల్లాల్లో పాగా వేస్తే అధికారం దక్కించుకోవచ్చన్న సెంటిమెంట్ దాదాపు అన్ని పార్టీల్లో ఉంది.. అందుకే గోదావరిజిల్లాలో పట్టుకోసం ఎలాంటి నిర్ణయాలైన అమలు చేయడానికి వెనకడుగు వేయట్లేదు… ముఖ్యంగా టీడిపి కంచుకోట అయిన పశ్చిమగోదావరిజిల్లాలో అన్ని సీట్లు మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటి నుంచే మార్పులు చేర్పులపై దృష్టిపెట్టింది … ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సీటును కొత్త వారికి కేటాయించే ఆలోచన చేస్తోందంట టీడిపి అధిష్టానం. ప్రస్తుతం ఏలూరు సిట్టింగ్ ఎంపిగా ఉన్న మాగంటి వెంకటేశ్వరావు అలియాస్ మాగంటి బాబు పనితీరుపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు… అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో మాగంటి బాబుకు పొసగడం లేదంట .. దాంతో ఎంపిగా మరో అభ్యర్ధిని రంగంలోకి దించేందుకు పావులు కదుపుతోందంట అధికారపక్షం..

 

2014 ఎన్నికల్లో ఎంపిగా ఎన్నికైన మాగంటి బాబు పనితీరుపై ముందు నుంచి విమర్శలున్నాయి.. ఇతర నేతలతో సఖ్యతగా మెలగకపోవడం.. పోలవరం, చింతలపూడి వంటి అసెంబ్లీ సెగ్మెంట్ విషయాల్లో గ్రూపులను ప్రోత్సహించారనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి… దానికి సంబంధించి అధినేత ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయనతీరు మార్చుకోలేదంటారు.. దాంతో మాగంటి బాబుపై వేటుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆ క్రమంలో ఏలూరు పార్లమెంటు మెంబరుగా ఉన్న మాగంటి బాబుకు వచ్చే ఎన్నికల్లో కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఎంపిగా మాగంటి బాబు పూర్తిస్థాయి పనితీరు కనపరచలేకపోవడంతో టీడిపి అధిష్టానం ఈనిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటునుంచి పోటిచేయబోయే అభ్యర్ధిగా బోళ్ళ రాజీవ్ పేరు వినిపిస్తోంది… టీడిపి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బోళ్ల బుల్లిరామయ్య మనవడు కావడంతో రాజీవ్ కు ఏలూరు పార్లమెంటు టిక్కెట్టు కేటాయింపు ఖాయమంటున్నారు.

బోళ్ల వారసుడు రాజీవ్‌ రాజకీయ నేపద్యం ఉన్న నేతకావడంతో పాటు యువకులకి అవకాశం కల్పించాలనే ఆలోచనలో టీడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది… ఏలూరు పార్లమెంటు నుంచి బరిలో దిగేందుకు రాజీవ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారంట కూడా .. నియోజకవర్గ నేతలతో సమాలోచనలు చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారంట.. వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకొకూడదనే లక్ష్యంతో ఉన్న టీడిపి ఈనిర్ణయానికి వచ్చిందంటున్నారు…

బోళ్ల రాజీవ్ విషయంలో టీడిపి అధిష్టానం నిర్ణయాన్ని ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం స్వాగతిస్తున్నారు… మాగంటి బాబుతో పోల్చితే రాజీవ్ వల్ల తమకు ప్లస్ అవుతుందని ఆపార్లమెంటు పరిధిలోని కొందరు నేతలు భావిస్తున్నారు…. అదలా ఉంటే మాగంటి బాబు మాత్రం ఇంకా టిక్కెట్టు విషయంలో ధీమాగానే ఉన్నారు. ఏలూరు నుంచి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయబోతున్నట్టు బయటికి చెబుతున్నా ఆ దిశగా ఆయన అందరితో సమన్వయం కుదుర్చుకునే ప్రయత్నాలు చేయకపోతుండం గమనించాల్సిన విషయం.. జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన బోళ్ల బుల్లిరామయ్యకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ రాజీవ్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌గా కనిపిస్తోంది..