Home Entertainment Cinema

‘మా’ ని ముంచిన ప్రదీప్ పెళ్ళి చూపులు…

SHARE

యాంకర్ ప్రదీప్ తో ‘పెళ్లి చూపులు’ అంటూ ఆర్భాటంగా ప్రోగ్రాం స్టార్ట్ చేసిన మా టీవీ నిండా మునిగింది. దీన్నొక రియాలిటీ షోగా తీర్చిదిద్దిన షో నిర్వాహకులు.. యాంకర్ ప్రదీప్, సుమలకు ఉన్న క్రేజ్‌తో ఈజీగా రేటింగ్స్ పెంచేసుకోవచ్చిన భావించారు. కానీ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. ఎందుకోగానీ ఆది నుంచే ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పెళ్లి చూపుల కోసం ఆ షో యాజమాన్యం ఎంచుకున్న అమ్మాయిల వల్గారిటీని చూసిన ప్రేక్షకులు కూడా చీ కొట్టేశారు….

ఈ షో చివరికి ఎలా అయిందంటే ఓ ఫంక్షన్ లో ఈ షో ని ఇమిటేట్ చేస్తూ పిల్లలు చేసిన పేరడి షో తెగ ట్రెండై కూర్చుంది. అసలు యాంకర్ ప్రదీప్ ప్లేస్ లో బిత్తిరి సత్తిని పెడితే ఎలా ఉంటుందన్న జోకులు కూడా చాలానే పేలాయి. జనాల టేస్ట్ ,కల్చర్ ని పట్టించుకోకుండా చేసిన ఈ షో అడ్డంగా ఫ్లాపైంది. మధ్యమధ్యలో అనసూయ వంటి సెలబ్రిటీలను గెస్ట్‌లుగా షోకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ షో కోసం పనిచేసినందుకు యాంకర్ సుమ, ప్రదీప్‌లపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షో రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో షో నిర్వాహకులకు భారీ నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

‘మా’ఛానల్ ఏర్పాటు చేసిన ఈ షో దాదాపు రూ.60 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందట. దీంతో ఇక ఖర్చు భరించలేక షూటింగ్ మొత్తం పూర్తి చేసి మూడు రోజుల క్రితమే అమ్మాయిలందరితో బయట ఎక్కడా కూడా షో పూర్తయ్యేవరకూ ఫోకస్ అవ్వకూడదంటూ సంతకాలు తీసుకుని సెట్ నుంచి పంపించేసినట్టు సమాచారం. ఈ షో ఈనెల 9వ తేదీతో ముగియనుంది.