Home News Politics

లోకేష్ పై క్లారిటీ…మరి జనసేనాని పోటీ ఎక్కడ…!

SHARE

ఏపీలో ప్రముఖ నేతల పోటీ పై ఉత్కంఠ కొనసాగుతోంది. జన సేన అధినేత పవన్ , లోకేష్ లు పోటీ చేసే సీట్లపై సస్పెన్స్ కొనసాగుతుంది. షెడ్యూల్ విడుదల తరువాత కూడా ఈ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి రెండు పార్టీలు. ఇంతలో లోకేశ్ సీటు పై క్లారిటీ ఇచ్చింది టీడీపీ.మొదట విశాఖ భీమిలి నుంచి అని గుంటూరు పెడకూరపాడు అని కథనాలు వినిపించినా ఫైనల్ గా మంగళగిరి ఫిక్స్ చేశారు…ఇక జనసేనాని పోటీ పై సర్వాత్ర ఆసక్తి నెలకొంది….

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మూడు పార్టీలు అభ్యర్థుల విషయంలో కసరత్తు పూర్తి చేస్తున్నాయి. అయితే ఆయా పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై మాత్రం ఇప్పటికి ఉత్కంఠ కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్, టిడిపి ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఈ సారి ఎన్నికల భరిలోకి దిగుతున్నారు. దీంతో వీరిద్దరు ఎక్కడ పోటీ చెయ్యబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాయలసీమలో పోటీ చేస్తానని ఒకటిరెండు సందర్భాలలో పవన్ ప్రకటన చేశారు. ఎన్నికల బరిలో దిగాలి అనుకుంటున్న లోకేష్ కోస్తా ప్రాంతం లేదా ఉత్తరాంద్ర నుంచి పొటీ చెయ్యాలని భావిస్తున్నారు.

పవన్ కళ్యాన్‌ తూర్పు గోదావరి లేదా విశాఖ జిల్లాల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో పవన్ పోటీపై పార్టీలో చర్చ జరుగుతుంది. అక్కడ సామిజిక సమీకరణలు, ఇతర లెక్కలపై సమీక్ష చేసుకున్న జనసేన అధినేత…పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖ జిల్లా గాజువాక లో పోటీ పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈరెండు నియోజవకర్గాల్లో ఒక చోట పవన్ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు సీట్లు టిడిపి నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని గతంలో పిఆర్పి గెలచుకుంది. ఇప్పుడు అదే స్థానంలో పవన్ పోటీకి దిగేఆలోచనలో ఉన్నారు. జనసేన ప్రకటించే మొదటి లిస్టులోనే పవన్ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు.

ఇకపోతే టిడిపిలో నెంబర్ టూగా ఉన్న లోకష్ పోటీ పై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. లోకేష్ ఎక్కడ నుంచి బరిలోకి దిగాలి అనే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరిగింది…గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకూరపాడు తరువాత విశాఖ జిల్లా భీమిలి నియోజవకర్గం పేరు తెరపైకి వచ్చింది. చివరికి మంగళగిరి నుంచి బరిలో దిగేందుకు ప్లాన్ సిద్దం చేశాఅరు టీడీపీ బాస్. పోలింగ్ కు నెల రోజుల సమయం కూడా లేదని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన నేతలు ఆందోళన పడుతున్నారు. అయితే పార్టీల్లోన్ని చాలా మంది కీలక నేతలు ఎక్కడ నుంచి బరిలో దిగుతారు అనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. లోకేష్ సీటు పై ఇప్పటివరకు ఇలా నాన్చడం సరైన వ్యూహం కాదని పార్టీ నేతలు అభిప్రాయం పడుతున్నారు. ఏదిఏమైనా…..ఇక జనసేనాని పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై మరి కొన్ని రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు.