Home News Politics

కుప్పంలో బాబు మెజార్టీ మళ్ళీ తగ్గనుందా…?

SHARE

రాష్టంలో అత్యంత వెనుక బడ్డ స్థానం కుప్పం నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు 1989 నుంచి వరుసగా అరవ సారి ప్రాతినిద్యం వహిస్తున్నారు.ముఖ్యమంత్రిగా నియోజకవర్గాన్ని మోడల్ గా అభివృద్ది చేసినప్పటికి నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా అయన మెజార్టీ తగ్గుతుంది. ఈసారి మరింత తగ్గే అవకాశముందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. అసలు కుప్పంలో బాబు మెజార్టీ తగ్గడానికి గల కారణం ఏంటీ….

మారు మూల వెనుక బడిన ప్రాంతం కుప్పం, తమిళనాడు – కర్నాటక సరిహాద్దులో వున్న ప్రాంతం. తెలుగు కంటే తమిళం,కన్నడం అత్యధికంగా మాట్లాడే ప్రాంతం. ఇలాంటి ప్రాంతం రాజకీయంగా చైతన్య వంతమైంది అని చెప్పవచ్చు. ఇక్కడ టిడిపి ఆవిర్బావరం వరకు కేవలం రెండు సార్లు అది కూడా 1955,1978 లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాదించింది. 1962 లో సిపిఐ,67, 72లలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. తర్వాత టిడిపి అవిర్బారం నుంచి 1983,1985లలో టిడిపి అభ్యర్థి రంగ స్వామి నాయుడు విజయం సాదించగా 1989 నుంచి2014 వరకు వరుసగా అరుసార్లు చంద్రబాబు నాయుడు విజయం సాదించారు.

1989లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థిపై కేవలం 6,918 ఓట్ల తేడా తో గెలుపోందారు. 1999లో అయన మెజార్టీ భారీగా అరవై అరు వేలకు చేరింది, 2004లో 59,588 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు, 2009లో 46వేలతో సుబ్రమణ్యం రెడ్డి పై విజయం సాదించారు. 2014లో వైసీపీ నియోజకవర్గంలో ఎక్కువుగా వున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయిన చంద్రమౌళిని రంగంలో దింపారు.ఈసారి వైసీపీ ఎంతగా ప్రయత్నించిన చంద్రబాబు 47వేలతో విజయం సాదించాడు.అయితే 66 వేల మేజార్టీ నుంచి 47 వేలకు పడిపోవడం చంద్రబాబుని ఇబ్బంది పెట్టింది అనిచెప్పవచ్చు..

అయితే ఈసారి వైసీపీ ముందు జాగ్రతగా స్థానిక నాయకుల అవినీతి అంటు పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టి చంద్రబాబు మెజార్టీని తగ్గించి చిత్తూరు ఎంపీ సీటును టార్గెట్ చేసింది. ఇందులో బాగంగా స్థానికంగా వున్న యువకులను అకర్షించడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు జిల్లా నాయకులు అంతా తరుచుగా విజిట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నాయకుల మద్య వున్న విభేదాలు కూడా కొంత పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి కారణమవుతున్నాయని అంటున్నారు పార్టీ నాయకులు. టిడిపి,చంద్రబాబు ఇమేజ్ తోనే ఇక్కడ పార్టీ నడుస్తుంది.అత్యంత వెనుక బడిన నియోజకవర్గం అయిన కుప్పంలో మౌళిక సదుపాయాల కల్పన బాగానే జరిగింది.విద్యాసంస్థలతో పాటు రవాణా సదుపాయం కూడా వుంది.అయిన మెజార్టీ ఎందుకు తగ్గుతుందని కార్యకర్తలు అంటున్నారు.సీనియర్ నాయకుల మద్య విబేదాలతో పాటు వారి చేతి వాటం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు.ఈనేపద్యంలో ఈసారి మెజార్టీ పెంచాలని సీరియస్ గా అదినేత అదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మండలానికి ఓక ఇన్ చార్జీ గా సీనియర్ నాయకులు వున్నారు. అయితే వీరు అందరని కలుపుకు పోవడంలేదనే విమర్శలున్నాయి.ఈనేపద్యంలో కుప్పంలో అరు నెలల క్రితం పార్టీ సర్వేకు వచ్చిన బృందం పై దాడి కూడా జరిగింది. అంటే వీరు బయటకి ఏ సమాచారం పోకుండా జాగ్రత పడుతున్నారని అంటున్నారు కార్యకర్తలు. ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీయకుండా చేస్తుండటంతో పార్టీ దెబ్బతింటుందని దీంతో మెజార్టీ తగ్గిందని ఈసారి చంద్రబాబు జాగ్రత పడక పోతే మెజార్టీ మరింత తగ్గే అవకాశముందని క్యాడర్ అందోళన పడుతుంది. ఈనేపద్యంలో చంద్రబాబు నియోజకవర్గం పై దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు.