Home News Politics

టీఆర్ఎస్ సోషల్ మీడియా కి కేటీఆర్ దిశా నిర్దేశం

మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న కేటీఆర్ అంత బిజీలో కూడా తెలంగాణ భవన్ లో సోషల్ మీడియా సమావేశంలో పాల్గొని దాదాపు గంటసేపు మాట్లాడారు. భవిష్యత్తులో సోషల్ మీడియా బలం ఏమిటో వివరించారు. సమావేశంలో హైలైట్స్:

….సోషల్ మీడియా కు ఇపుడున్న పదును గతం లో ఎపుడూ లేదు
…trs అంటే తిరుగు లేని రాజకీయ శక్తి
…trs పార్టీ కి సోషల్ మీడియా ఓ బలం
…ప్రజల్లో ఏ బలం లేకుండా కేవలం సోషల్ మీడియా తో పార్టీ లు మనుగడ సాధించలేవు
…ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీ కి సోషల్ మీడియా అదనపు బలంగా ఉంటుంది
…trs పార్టీ కి సోషల్ మీడియాలో 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు .ఏ పార్టీ మనకు దరిదాపుల్లో లేదు
…trs కు సోషల్ మీడియా లో పెయిడ్ వర్కర్స్ లేరు
…trs మీద అభిమానం తో ప్రేమ తో సోషల్ మీడియా సైనికులు పని చేస్తున్నారు
…తెలంగాణ ఉద్యమం లో కూడా వాస్తవాలు వివరించింది మన సోషల్ మీడియా కార్యకర్తలే
…కొన్ని పార్టీ లకు పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలు తప్ప అభిమానులు లేరు
..కొందరు ,కొన్ని పార్టీ లు చిచ్చు పెట్టేందుకే సోషల్ మీడియా ను వాడుకుంటున్నారు
…trs ఎపుడూ సోషల్ మీడియా ను ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకోలేదు
…సీఎం కెసిఆర్ కూడా సోషల్ మీడియా లో క్రియా శీలకంగా ఉంటారు
…పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి కెసిఆర్ సోషల్ మీడియా ఓ సాధనమని నమ్ముతారు
…బీజేపీ లక్ష్మణ్ నాకు వాళ్ళ పార్టీ అంటే భయం అంటున్నారు
…నాకు మోడీ అన్నా రాహుల్ అన్నా ఏం భయం లేదు
…తెలంగాణ లో బీజేపీ కి ఏముందని భయపడాలి
…ఆరువందలకు పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలపలేక పోయింది
…సోషల్ మీడియా లో వాస్తవాలు వివరించాలి
…దూషణ ల పర్వం వద్దు
…దూషణలను ఎపుడూ trs ప్రోత్సహించదు
…ప్రతి గడపకు మన సందేశం వెళ్ళాలి
…సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ కి మధ్య సమన్వయము పెరగాలి
..ఇందుకోసం క్రిశాంక్ ,సతీష్ రెడ్డి ,జగన్ మోహన్ రావు ,దినేష్ చౌదరి లను సోషల్ మీడియా కో ఆర్డినేట్లను నియమిస్తున్నాం
…trs సోషల్ మీడియా కార్యకర్తల కు వేధింపులు వస్తే పార్టి అండగా ఉంటుంది
…తెలంగాణ పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
…trs సోషల్ మీడియా కార్యకర్తలు సబ్జెక్టు తో కొట్టాలి
…కాంగ్రెస్ హాయం లో మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్నా ఉత్తమ్ దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలి
…2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కంటే గత ఐదేళ్ల లో రెట్టింపు నిధులు విడుదల చేశాం
..ఈ వాస్తవాలు ప్రచారం చేయాలి
.గతం లో 14 రోజులకు ఒకసారి చాలా మున్సిపాలిటీ ల లో నీళ్లు వచ్చేవి
…ఇపుడు ఆ పరిస్థితి లేదు
…led bulb లతో కరెంటు ను ఆదా చేశాం ..కోట్లాది రూపాయలు ఆదా చేయగలిగాo
…కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడం నా ముందున్న బాధ్యత
…పర ,తమ బేధాలు చట్టo అమలు లో ఉండవు
…అవినీతి చీడ రూపు మాపుతాo
…కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కోనసీమ గా మారడం ఖాయం
…పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి లతో తెలంగాణ తీరే మారుతుంది
…సంస్కారవంతo గా సమాచార మివ్వoడి
…ఈ మకర సంక్రాంతి తో ప్రతిపక్షాల భ్రాంతి తొలగాలి
…సోషల్ మీడియా గులబీ సైనికులకు గుర్తింపు ,గౌరవం ఇస్తాం