Home News Politics

చంద్రబాబుని కోట్ల కోరింది ఇదేనా….?

SHARE

కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక ఇక లాంఛనమే… సీఎం చంద్రబాబుని కలసిన కోట్ల జిల్లాలో మూడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేయాలని కోరామని చెబుతున్నా .. ఎన్నికలపై కూడా చర్చించారని సమాచారం… ఆ క్రమంలో కోట్ల సీఎం ను ఏ సీట్లు కోరారు?…చంద్రబాబు ఏమని హామీ ఇచ్చారు ?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది … సీనియర్‌ నేతలు సైతం ఉన్న పార్టీలను వదిలి వలస రాజకీయాలు తెరలేపుతున్నారు .. ఆ క్రమంలో మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి వచ్చారు . .. ఆయన టిడిపిలో చేరడం లాంఛనమైన నేపధ్యంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు … సీఎంను కలసిన సందర్భంగా వేదవతి ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎల్లెల్సీ నీరు పైప్ లైన్ ద్వారా తీసుకురావాలని కోరామని, వీటికి అంగీకరిస్తే టీడీపీ లో చేరతామని చెప్పామన్నారు కోట్ల…

అయితే తమ కుటుంబ రాజకీయ భావిష్యత్తుపై కూడా కోట్ల టిడిపి అధినేతతో మాట్లాడారట. .. రాబోయే ఎన్నికల్లో కోట్ల జిల్లాలో ఏ సీట్లు కోరారనే విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. కర్నూలు పార్లమెంట్ స్థానం, డోన్ అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాని కోట్ల కుటుంబం కోరిందంట.. ఇక ఆలూరు,కొడుమురు విషయంలో కూడా తమ అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని కోట్ల మెలికపెట్టారు…అదే ఇప్పుడు గందరగోళానికి కారణమవుతోంది..

డోన్ అసెంబ్లీ స్థానం పై కేఈ, కోట్ల కుటుంబాల మధ్య పీఠ ముడి పడటం ఖాయంగా కనిపిస్తోంది.. డోన్ లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ టిడిపి సమన్వయకర్తగా వున్నారు… డోన్ స్థానం విషయంలో కేఈ కుటుంబం వెన్నక్కి తగ్గే అవకాశం లేదు… ఈ విషయంలోనే టీడీపీలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉంది… కోట్ల కుటుంబానికి డోన్ కాకుండా ఆలూరు లో అవకాశం ఇస్తారని టీడీపీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. అందుకు కోట్ల కుటుంబం ఒప్పుకుంటుందా ..అన్న ప్రశ్న తలెత్తుతుంది. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైం నుంచి కూడా డోన్ సొంత నియోజకవర్గంగా ఫీలవుతుంది కోట్ల కుటుంబం.

ఇక కోట్ల టీడీపీలో చేరిక విషయంలో తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని కేఈ కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నారంట… ఆ విషయమై సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట… ఇవ్వాళ అమరావతిలో శ్రీవారి ఆలయ భూమి పూజ విషయంలోను తన అసంతృప్తిని బయట పెట్టారు. ఏదేమైనా కోట్ల , కేఈ కుటుంబాల మధ్య రచ్చ మొదలైదే మొదటికే మోసం వస్తుందని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి .. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేఈ, కోట్ల కుటుంబాల మధ్య చంద్రబాబు ఎలా సమన్వయం కుదురుస్తారో చూడాలి..