Home News

కోమటిరెడ్డి యూటర్న్ వెనుక సీన్ ఇదేనా…!

SHARE

అంతన్నారు .. ఇంతన్నారు… ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అయిపోయారు .. పార్టీ మారుతున్నట్లు ఫుల్‌ జోష్‌తో ప్రకటించిన ఆయన.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు .. చేరానుకుంటున్న పార్టీ తలుపులు ఆయన కోసం తెరుచుకోవడం లేదా? .. అలాగని ఉన్న పార్టీలో పెద్దలు ఆయన్ని కొనసాగనిస్తారా? .. ఇప్పుడు ఆ నాయకుడి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందా..? అసలు ఆయనకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?.. దాని పర్యావసానాలేంటి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. .. నల్గొండ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు … కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గానే ఉండాలనుకుంటున్నారు … అయితే మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్యం క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది .. ఏం చేయాలో పాలు పోవడం లేదో.. లేదంటే అనుకున్న దారులన్నీ మూసుకుని పోయాయో కానీ… ఆయన దిక్కులు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు…

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన హడావుడి చూసిన అందరూ … ఇక ఆయన బీజేపీ లో చేరిపొయినట్టే అనుకున్నారు… అమిత్ షా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోవాలని కూడా ఆయన ఫిక్స్‌ అయ్యారు… అదే ధీమాతో… కాంగ్రెస్ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నోటీసు లకు కూడా… కొంత వివాదాస్పద వివరణే ఇచ్చారు… అయితే ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది… అమిత్ షా వచ్చి వెళ్లారు కానీ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.

అదే ఇప్పుడు కోమటిరెడ్డి అనుచరులను టెన్షన్‌ పెడుతోందంట … రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడం బిజెపికి ఇష్టం లేదా? … అంత హడావుడి చేసిన ఆయన ఎందుకు పార్టీ మారలేదు? అన్న అంశాలు అంతుపట్టకుండా తయారయ్యాయంట వారికి … నిజంగా బీజేపీ వద్దనుకుని ఉంటే… అది రాజగోపాల్‌రెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది … మరోవైపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో… ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ లో ఉన్నారు… క్యాడర్ ఏం చెప్పుకోవాలి అన్న క్లారిటీ లేకుండా పోయిదంట అనుచరులకి…

కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం… అటు క్యాడర్‌తో కాని .. ఇటు సన్నిహితులతో కాని తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెప్పడం లేదంట.. దాంతో మున్సిపోల్స్‌లో పోటీ సిద్దమవుతున్న ఆయన అనుచరులు తలలు పట్టుకుంటున్నారంట.. ఎన్నికల ముందు ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏంటా అని వాపోతున్నారంట..

మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఆయన్ని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టడమే కాదు … ఆయన్ని నమ్ముకున్న వారికి కూడా గండం తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది … మున్సిపల్ ఎన్నికలు ముంచుకోస్తున్న తరుణంలో ఏం చేయాలో అంతుపట్టక వారంతా తెగ ఇదై పోతున్నారంట.. మొత్తమ్మీద ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారినట్లు కనిపిస్తుంటే… ఆయన అనుచరుల పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారైంది.