Home News

అన్నకి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్లస్ కాషాయం నేత…!

SHARE

ఒకప్పుడు ఆయన దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు … ఇప్పుడు ఆయనకే కొత్త రాజకీయం నేర్పే ప్రయత్నం చేస్తున్నారు … ఆ పాఠాలు చెప్పటం సంగతి పక్కన పెడితే … ఒక రేంజ్లో పరేషాన్ కూడా చేస్తున్నారంట… ఇంతచేస్తే వారు పరాయివాళ్లేం కాదు.. ఒక తల్లి బిడ్డలే.. ఇంతకాలం కలిసి నడిసిన ఆ ఇద్దరు కొంతకాలంగా తలోదారి అయినట్లు కనిపిస్తున్నారు .. ఆ అపుర్వసోదరుల మధ్య ఏం జరుగుతుందో మీరే చూడండి…

తెలంగాణ కాంగ్రెస్ లో… అపూర్వ సహోదరులు కోమటిరెడ్డి బ్రదర్స్‌… నల్గొండ జిల్లా రాజకీయాల్లో చాలాకాలం వాళ్ళు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు సాగింది… సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎదిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి … కొన్నాళ్ళకు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజకీయఅరంగేట్రం చేయించారు .. అయితే ఇప్పుడు.. ఆ తమ్ముడి స్టేట్మెంట్లు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయంట ఆయనకి .. తన వైఖరితో అన్న రాజకీయ జీవితంలో ఆ తమ్ముడు చిచ్చు పెడుతున్నారంట..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… రాజకీయాల్లో కీలకం అయ్యాక…తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ని రంగంలోకి తీసుకువచ్చారు… భువనగిరి ఎంపీ గా గెలిపించారు. అన్నా..తమ్ముళ్లు జిల్లా రాజకీయాలను శాసించారు… ప్రస్తుతం కూడా పైచేయి సాధించే ప్రయత్నాల్లోనే ఉన్నారు … అందులో భాగంగానే… ప్రతికూల పరిస్థితిల్లో కూడా మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి… పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు… ఇంతవరకు బాగానే ఉన్నా… గడిచిన కొద్దిరోజులుగా తమ్ముడి వ్యవహారంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తల బొప్పి కడుతోందంట..

రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి… బీజేపీ లోకి వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నారు… ఆయన తన భవిష్యత్తు కోసం ఏ రాజకీయం అయినా చేసుకోవచ్చు .. ఏ పార్టీలోకి అయినా వెళ్లవచ్చు … అయితే ఆయన తన అన్న ఫ్యూచర్‌ కూడా నిర్ణయించేస్తున్నారు .. అసెంబ్లీ లో మీడియాతో చిట్ చేసిన రాజగోపాల్ రెడ్డి… తానే కాదు… అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తున్నారని కామెంట్‌ చేసి కలకలం రేపారు.. అప్పటి వరకు.. అన్న ఓ పార్టీ… తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పేంటని వాదించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తమ్ముడి వ్యాఖ్యలు ఇరకాటంలోకి నెట్టాయి… ఎప్పుడు తనదే పైచేయిగా ఉండాలనుకునే వెంకటరెడ్డి ఇప్పుడు సోదరుడి నిర్వాకంతో… వివరణ ఇచుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

నిజానికి… ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త నాయకుడిని వెతికే పనిలో ఉంది అధిష్టానం… పిసిసి చీఫ్‌ రేసులో వెంకట్ రెడ్డి కూడా ముందు వరుసలోనే కనిపిస్తూ వచ్చారు … కానీ… తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు … ఇస్తున్న స్టేట్‌మెంట్లు వెంకటరెడ్డి పరిస్థితిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి .. వస్తుంది అనుకుంటున్న పదవి కూడా ఇప్పుడు దూరం అవుతుందనే చర్చ కూడా మొదలయ్యింది…

తమ్ముడిని ఏమి అనలేక… తాను ఏ నిర్ణయం తీసుకోలేక… అడ్డ కతెరలో పోకచెక్కలా తయారైందంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి.. మొత్తమ్మీద వేలుపట్టి రాజకీయాలు నేర్పిన అన్నకే చుక్కలు చూపిస్తున్నాడు ఆ తమ్ముడు…