Home News Politics

ఖమ్మం గులాబీ పార్టీలో ఎంపీ టికెట్ ఎవరికి..?

SHARE

ఖమ్మం గులాబి పార్టీ ఎంపీ అభ్యర్ధిపై బిగ్‌ డిస్కషన్‌ నడుస్తుంది. సిట్టింగ్‌కి సీటు హుళ్కేనని ఓ వర్గం .మాజీ మంత్రి తుమ్మలంటూ మరో వర్గం. ఇద్దరూ కాదూ కొత్తముఖమని ఇంకొ డిస్కషన్. ఇలా అధికార టీఆర్ఎస్ పార్టీలో వాడివేడి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మలుపులు తిరుగుతున్న ఎంపీ అభ్యర్ది‌ అంశం ఎటు తిరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నాయి ఖమ్మం గులాబీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫిర్యాదుల వెల్లువతో సిట్టింగ్‌ ఎంపీ బరిలో ఉండేనా? ఎంపీగా పోటికి తుమ్మల సుముఖమేనా? కొత్తవారికి అవకాశమిస్తారా? కేసీఆర్‌ మదిలో ఏముంది? టిఆర్‌ఎస్‌ పార్టీలో రసవత్తరంగా మారిన ఖమ్మం ఎంపీ అభ్యర్ధి పై స్పెషల్ రిపోర్ట్‌….

రాష్ట్రంలోని ఎంపీ అభ్యర్ధుల విషయంలో ప్రత్యేక పరిశీలనలో ఉన్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఎంపీ ఒకటిని అధికారపార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.కేసీఆర్‌ సర్వే రిపోర్టులు ఒక కారణమైతే, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో పార్టీ ఓటమి మరోకారణంగా ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.ఈ అంశాలకు తోడు పార్టీలో నెలకొన్న గ్రూపిజం బలమైన అంశంగా పార్టీ పరిగణిస్తుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 స్థానాలను కైవసం చేసుకోవాలని గులాబీ బాస్ డిసైడయ్యారు .రానున్న పార్టమెంట్‌ ఎన్నికల్లో తన అంచనాలు తారుమారు కారాదన్న పట్టుదలతో ఇప్పటినుంచే ఖమ్మం సీటు పై గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఒకే స్థానాన్నే గెలుచుకుంది. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల పార్టీ ఓటమిపాలైంది.ఈ లెక్కన ఎంపీ ఎన్నికల్లో పార్టీకి ఎదురీత తప్పదు.అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎకతాటిపై నడిస్తే టిఆర్‌ఎస్‌ మరోసారి ఓటమి తప్పదు. దీంతో ఖమ్మం సీటుపై టిఆర్‌ఎస్‌ పార్టీని ఓటమి సందేహాలు చుట్టుముడుతున్నాయి.ఫలితంగా కేసీఆర్‌ ఖమ్మం సీటు పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠమైన చర్చకు దారితీసింది.ఓటమి పాలైన మాజీ మంత్రి తుమ్మల తనను ఓడించి కొందరు రాక్షాస ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ఖమ్మం రాజకీయం వేడెక్కింది.

ఖమ్మం జిల్లా గులాబి పార్టీలో లుకలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి.గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి.నేతల మద్య నెలకొన్న విభేదాలు కాస్తా బహిరంగ విమర్శల స్థాయికి వెళ్ళాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎంపీ శ్రీనివాసరెడ్డి వెన్నుపోటు రాజకీయాలే కారణమని టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైన అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఎంపీ వెన్నుపోటు రాజకీయాల కారణంగానే ఒక్క ఖమ్మం మినహా మిగత అన్ని స్థానాల్లో ఓటమి చెందామని ఆరోపిస్తున్నారు వైరా,ఇల్లందు,కొత్తగూడెం,సత్తుపల్లి,పాలేరు అభ్యర్ధులు. చివరకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సైతం దారుణంగా ఓటమి చెందారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్ధులకు మాజీ మంత్రి తుమ్మల నాయకత్వం వహిస్తూ ఎంపీ శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు ఎగురవేశారు.అంతేకాదు ఎంపీ అభ్యర్ధిగా శ్రీనివాసరెడ్డిని ఖరారు చేయరాదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఆయనకే అవకాశమిస్తే గెలుపోటములకు తాము భాద్యత వహించమని తుమ్మల టీమ్‌ చెపుతున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ఎంపీ శ్రీనివాసరెడ్డి వైరాలో స్వంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన రాముల్‌నాయక్‌ను టిఆర్‌ఎస్‌ గూటికి చేర్చి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్నాడని ఆయన వర్గం చెబుతోంది. అంతేకాదు ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎంపీ శ్రీనివాసరెడ్డి బరిలో ఉంటాడని ఆయన వర్గీయులు బహటంగానే చెబుతున్నారు. అంతేకాదు బరిలో ఉండటమేకాదు గెలుపు ఆయనదేనని ఆయన వర్గీయులు ధీమాను వ్వక్తం చేస్తున్నారు.అందుకు వైరా ఎమ్మెల్యేతోపాటు,ఖమ్మం ఎమ్మెల్యే ఎంపీకి బాసటగా ఉన్నారని చెబుతున్నారు. ఇంతవరకు ఓకే అనుకున్నా మరీ మిగతా ఐదు నియోజకవర్గాల పరిస్థితి ఎంటన్నది గులాబి పార్టీ నాయకత్వానికి ప్రశ్నార్ధకంగా మారింది.అటు జిల్లాలో ఓటమి ఇటు పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోవైపు సర్వే రిపోర్టుల మద్య సీఎం కేసీఆర్‌ నిర్ణయం ఏలా ఉండబోతుందన్నది ఇప్పుడు బిగ్‌ క్వచ్చన్‌గా మారింది.