Home News Politics

ఖమ్మం ఖిల్లాలో గెలుపెవరిది….

SHARE

రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే, ఖమ్మం జిల్లా రాజకీయం మాత్రం మరోలా ఉంటుంది. అవును దీనికి గత ఎన్నికలే ఉదాహారణ.మొదటి నుంచి కూడా వామపక్షాల కంచుకొట గా ఉన్న ఖమ్మం నియోజకవర్గం తర్వాత కాంగ్రెస్ కి కంచుకోట గా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఇక్కడ నువ్వా నేనా అన్న తరహాలో పోటి పడ్డాయి. ఖమ్మం ఖిల్లాలో రాజకీయం ఎలా రంగులు మారుతుందో ఒకసారి చూద్దాం….

ఖమ్మం నియోజక వర్గంలో సుమారు 2,63,440 మంది ఓటర్లు ఉన్నారు.. అత్యధికంగా మూడు వర్గాలు బలంగాఉన్నాయి.ముస్లీం, కమ్మ, కాపు వర్గాలు బలంగాఉంటాయి. కమ్మ ఓట్లే అత్యదికంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు మొదటి నుంచి బలమైన వర్గం ముస్లిం ఓటర్లే,బలమైన ఓటుబ్యాంకు ఉన్నప్పటికి ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం కాంగ్రెస్ కి సమస్య. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్ ఇక్కడ సీనియర్ లీడర్ తుమ్మలకి షాకిచ్చారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు గులాబీ పార్టీలో ఇమిడిపోయారు.

గతంలో ఇక్కడ ఎప్పుడు వామపక్ష పార్టీలదే ఆదిపత్యం.. వామపక్షాలు మాత్రమే గెలుస్తుండే వారు.. ఒక్క సారి మాత్రమే ఇక్కడ టిడిపి గెలుపొందింది.. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు,తిరుగుబాట్ల వల్లనే ఇక్కడ ఆ ఒక్క సారి కూడ కాంగ్రెస్ ను ఓడించి టీడీపీ గెలుపొందింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన పువ్వాడ అజయ్ టిఆర్ ఎస్ తీర్దం పుచ్చుకున్నాడు..పొత్తులో భాగంగా టీడీపీ ఖమ్మం సీటు కొరుతుంది. మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు పోటీలోకి దించే ఆలోచనలో టీడీపీ పార్టీ ఉండగా కాంగ్రెస్ తరుపునుంచి రేణుకచౌదరి,గాయత్రి రవి,పొట్ల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో సన్నిహితంగా ఉండే గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర మాత్రం తానే కాంగ్రెస్ అభ్యర్ధినంటూ ప్రచారం సైతం మొదలెట్టేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రవించంద్ర ఫైనాన్షీయల్ బ్యాక్ గ్రౌండ్ కూడా గట్టిగానే ఉంది. పొత్తుల వ్యవహారం తేలకముందే తనదే సీటంటూ రవి ప్రచారం చేయడం కాంగ్రెస్ శ్రేణులను కొంత గందరగోళానికి గురి చేస్తుంది. టిఆర్ఎస్ లో చేరిన పువ్వాడ , తన వర్గాన్ని పటిష్టం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్ లోని వారందరిని కూడ టి ఆర్ఎస్ లో చేర్పించడంలో సక్సెస్ అయ్యాడు..ఇక అధికార టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది.

వరుస ఎన్నికలు పరిశీలిస్తే ఎక్కువ సార్లు ఖమ్మం ఎమ్మేల్యే గా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపొందారు. ఇక్కడ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి గట్టి పోటీ ఇవ్వాలంటే మాత్రం మాజీ ఎంపీ నామా నే కరెక్ట్ అంటున్నాయి విపక్షపార్టీలు. అంగ,అర్ధ బలాల విషయంలో ఎదురులేని గులాబీ పార్టీ అభ్యర్ధి పువ్వాడ అజయ్ ప్రచారంలో దూసుకుపోతున్న తీరు పరిశీలిస్తే నామా పోటీ చేస్తేనే రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే అజయ్ విజయం నల్లేరు పై నడకే……