Home News

ఆ కార్పోరేషన్ కు ఏమైంది..?

SHARE

పాలక వర్గం కొలువుదీరిన నాటి నుండి కార్పోరేటర్స్ వర్సెస్ మేయర్ గా మారింది..ఒకవైపు కార్పోరేటర్ల కొత్త చట్టం ధీమా..మరోవైపు నేను పాత చట్టం వాడినే అంటున్న మేయర్ వెరసి కార్పోరేషన్ లో మేయర్ ను తొలగించాలని అధికార కార్పోరేటర్లే రహస్య సమావేశాలు…కొత్త చట్టమే మేయర్ కు శాపంగా మారిందా..? సొంత పార్టీ నేతల మధ్య చెలరేగిన అగాధంతో ఖమ్మం కార్పోరేషన్ రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది..

ఖమ్మం కార్పోరేషన్ లో అసమ్మతి ముదురుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది..అధికార పార్టీలోని కార్పోరేటర్లే మేయర్ కు వ్యతిరేకంగా చర్చలు నడుపుతున్నారు. గతేడాదే మేయర్ పాపాలాల్ ను తొలగించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ ను కలిసారు కార్పోరేటర్లు…మళ్లీ అదే సమస్య తెరపైకి వచ్చింది..ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం మూడేళ్ల పాలన తర్వాత మేయర్ పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండడంతో అధికార పార్టీ కార్పోరేటర్లు అంతా మేయర్ ని దించాలని ఓ కార్పోరేటర్ ఇంట్లో సమావేశమయ్యారు.

గతేడాది మేయర్ పాపాలాల్ తీరుపై అసంతృప్తి ప్రకటించిన కార్పోరేటర్లు..మరోసారి నిరసన గళం వినిపిస్తున్నారు…మేయర్ పదవి నుంచి పాపాలాల్ ను తొలగించాలని గతేడాది కార్పోరేటర్లు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు కలిసి ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ కార్పోరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మేయర్ ఒంటెద్దు పోకడలు నచ్చడంలేదంటూ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని కార్పోరేటర్లు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది..

ఖమ్మం కార్పోరేషన్ కి ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటగా పాతచట్టం ప్రకారం అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు ఆగాల్సి ఉంది..దీంతో కొత్తగా వచ్చిన మునిసిపల్ చట్టం ఖమ్మం మేయర్ కు శాపంగా మారింది. మేయర్ కార్పోరేటర్ల ని లెక్కచేయడంలేదని, కార్పోరేటర్ల పట్ల ఆయన ప్రవర్తన బాగోలేదని మేయర్ ని మార్చాలని డిమాండ్ చేస్తూ 2018 మే లో కార్పోరేటర్లు అంతా కేటీఆర్ ను కలిసారు..ఆ విషయం లో తుమ్మల వద్దని చెప్పినప్పటికీ కార్పోరేటర్లు మాత్రం తుమ్మల మాటను వినకుండా హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ ను కలవడం తో ఆయన కూడా అక్కడ సర్దిచెప్పడంతో పాటు ఈ అంశాన్ని తుమ్మల తో చర్చిస్తే బాగుంటుందన్నట్టు సంకేతాలు ఇవ్వడంతో..కార్పోరేటర్లంతా తుమ్మల ను కలవడంతో …అంతా సద్దుమణిగింది.

ఖమ్మం కార్పోరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి..42 మంది కార్పోరేటర్లు టీఆర్ఎస్ వైపు ఉండగా..37 మంది వరకు అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నారు..కాగా ఇదే అంశం పై మరోసారి కార్పోరేటర్లు అంతా సమావేశమవనున్నట్టు కీలక సమాచారం. పాలక వర్గం ఏర్పడ్డ నాటి నుండి వివాదాలకు కేంద్ర బిందువు గా మారిన ఖమ్మం కార్పోరేషన్ లో మరోసారి తెరమీదకి వచ్చిన “అవిశ్వాసం” అంశం పరిణామాలు ఎటుదారితీయనున్నాయో చూడాలి మరి…